
ఉత్సాహంగా రోలార్ స్కేటింగ్ పోటీలు
కరీంనగర్‌స్పోర్ట్స్/కరీంనగర్‌రూరల్: కరీంనగర్ జిల్లా రోలార్ స్కేటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన ఉ మ్మడి జిల్లాస్థాయి రోలార్ స్కేటింగ్ పోటీలకు విశేష స్పందన వచ్చింది. అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్‌రెడ్డి పోటీలను ప్రారంభించారు. క్రీడలతో విద్యార్థులకు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. అలాగే బొమ్మకల్‌లోని బిర్లా ఇంటర్నేషనల్ స్కూల్‌లో రోడ్ ఈవెంట్ స్టేట్ సెలక్షన్ పోటీలు నిర్వహించారు. స్కేటింగ్ బాధ్యులు విజయభాస్కర్, గట్టు అనిల్‌కుమార్‌గౌడ్, డి.వీరన్న, కృష్ణమూర్తిగౌడ్, సాయినరహరి తదితరులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా రోలార్ స్కేటింగ్ పోటీలు