
అక్రమంగా ఎరువుల బస్తాల తరలింపు
మానకొండూర్: మండలకేంద్రంలోని గ్రోమోర్ సెంటర్ నిర్వాహకులు రైతులకు అందించాల్సిన ఎరువుల బస్తాలను అక్రమంగా వ్యాన్‌లో తరలిస్తూ పట్టుబడ్డారు. స్థానికులు అందించిన స మాచారంతో మండల వ్యవసాయాధికారి శ్రీనివాస్‌రెడ్డి మానకొండూర్‌కు చేరుకుని ఎరువుబస్తాలు తరలిస్తున్న వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వ్యాన్‌లో 50 యూరియా, ఇతర ఎరువుల బస్తాలు ఉన్నట్లు తెలిపారు. వాటిని పరకాల నడికుడకు తరలిస్తున్నట్లు వివరించారు. అక్రమంగా ఎరువులు తరలిస్తున్న వారిపై 6 ఏ కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. అలాగే గ్రోమోర్ సెంటర్‌లో సుమారు రూ.20 లక్షల వివిధ రకాల ఎరువుల బస్తాలు ఉండగా, వాటి రిజిస్టర్, లేబుళ్లు సరిగా లేక సీజ్ చేశామని వ్యవసాయాధికారి వెల్లడించారు.
పట్టుకున్న అధికారులు