
తియ్యనైనది తెలుగు భాష
కొత్తపల్లి(కరీంనగర్): తెలుగు భాష తియ్యనైనదని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అశ్విని తానాజీ వాకడే అన్నారు. తెలంగాణ భాష దినోత్సవాన్ని పురష్కరించుకొని కరీంనగర్ వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ విద్యా సంస్థల కేంద్ర కార్యాలయంలో మంగళవారం కాళోజీ నారాయణరావు జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి అల్ఫోర్స్ చైర్మన్ వి.నరేందర్‌రెడ్డితో కలిసి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని తెలుగు ఉపాధ్యాయులు, అల్ఫోర్స్ విద్యాసంస్థల్లోని తెలుగు ఉపాధ్యాయులను సన్మానించారు. జిల్లా క్వాలిటీ కో– ఆర్డినేటర్ అశోక్ రెడ్డి, ప్రముఖ కవి మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే
అల్ఫోర్స్‌లో తెలుగు ఉపాధ్యాయులకు ఘన సన్మానం