
పేదల బతుకులను ఆగం చేయొద్దు
హుస్నాబాద్– కొత్తపల్లి మధ్య నిర్మించతలపెట్టిన నాలుగు వరుసల రహదారిని మా గ్రామం మీదుగా కాకుండా బైపాస్ ద్వారా చేపట్టండి. కొద్దిరోజుల క్రితం బైపాస్ కోసమే అధికారులు సర్వే చేపట్టారు. కొందరు స్వార్థ రాజకీయం కోసం గ్రామం మీదుగా వేయాలని ప్రయత్నించారు. ఇదే జరిగితే వందలాది ఇళ్లను కూల్చాల్సి వస్తుంది. సుమారు 200 మంది కుటుంబాలు రోడ్డున పడతాయి. పైగా గ్రామంలో ఐదు మూలమలుపులు ఉన్నాయి. ఇది ప్రమాదాలకు కారణం కానుంది. వాహనాల స్పీడ్ పెరిగి తరచూ ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. అలాగే గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు పార్కింగ్ కూడా తగ్గిపోతుంది. ఎలా చూసినా నష్టం కలిగించే రహదారిని గ్రామం మీదుగా కాకుండా బైపాస్ చేపడితే బాగుంటుంది.
– బాధిత కుటుంబాలు, సుందరగిరి, చిగురుమామిడి