
లెవల్ క్రాసింగ్ గేట్లకు మరమ్మతు
ఓదెల(పెద్దపల్లి): కాజీపేట– మల్హార్ష సెక్షన్ల మధ్యలోని ఓదెల, పొత్కపల్లి రైల్వేస్టేషన్ల సమీప లెవల్ క్రాసింగ్ గేట్‌ల మరమ్మతు కొద్దిరోజులుగా సాగుతోంది. దీంతో రైళ్ల వేగం బాగా తగ్గింది. ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. గూడ్స్, ప్యాసింజర్ రైళ్లు చాలా ఆలస్యంగా నడవడంతో గమ్యస్థానాలు చేరుకునేందుకు ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఓదెలలో తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, స్థానికులు, పొత్కపల్లిలో గేట్‌తో జమ్మికుంట నుంచి సుల్తానాబాద్‌కు వెళ్లే ప్రయాణికులు, ప్రజలు నరకయాతన పడుతున్నారు. గేట్ మరమ్మతు సందర్భంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.