
ప్రభుత్వ భూమిలోని భవనం స్వాధీనం
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి తహసీల్దార్ పరిధి సీతారాంపూర్‌లోని సర్వే నంబర్ 26 ప్రభుత్వ శిఖం భూమిలో అక్రమంగా నిర్మించిన భవనాన్ని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశా ల మేరకు శనివారం రాత్రి అధికారులు స్వాధీ నం చేసుకున్నారు. తహసీల్ధార్ వెంకటలక్ష్మి, నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొయినొద్దీన్ ఆధ్వర్యంలో భవనంలోని సామగ్రిని ఖాళీ చేయించే ప్రయత్నం చేయగా.. మ హిళలు అడ్డుకున్నారు. తప్పుకోవాలంటూ తహసీల్దార్ చెప్పినప్పటికీ వినకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ బిల్లా కోటేశ్వర్ అక్కడికి చేరుకుని భవనాన్ని ఖాళీ చేయించారు. భవనాన్ని ఓపెన్ స్కూల్‌కు అప్పజెప్పనున్నట్లు అధికారులు వెల్లడించారు. భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని ఇటీవల కలెక్టర్‌కు గ్రామానికి చెందిన పాదం శివరాజ్, ఎడ్ల లక్ష్మణ్ ఫిర్యాదు చేశారు. ఎంఈవో ఆనందం, ఆర్‌ఐలు నదీమ్, రజనీకుమార్ పాల్గొన్నారు.
కరీంనగర్‌కల్చరల్: పదోతరగతి, ఇంటర్ ఫెయిలైన స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులను తెలంగాణ ఓపెన్ స్కూల్లో చేర్పించాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆదేశించారు. మెప్మా, డీఆర్‌డీవో అధికారులతో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ, ఉల్లాస్ రిజిస్ట్రేషన్లపై శనివారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. రిజిస్ట్రేషన్ల గడువు ముగియకముందే మీసేవ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించి, ఓపెన్ స్కూల్లో చేర్పించాలన్నారు. స్వయం సహాయక సంఘాల్లోని ప్రతి మహిళ అక్షర జ్ఞానం కలిగి ఉండాలన్న ఉల్లాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. డీఆర్‌డీవో శ్రీధర్, మెప్మా పీడీ సరూపారాణి పాల్గొన్నారు.
జమ్మికుంట: వ్యవసాయ సాంకేతిక ప్రయోగ పరిశోధన సంస్థ(ఏటీఏఆర్‌ఐ) హైదరాబాద్ ఆధ్వర్యంలో తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరులో ఈ నెల 4వ తేదీన 2024 ఏడాదికి సంబంధించి వార్షిక సమీక్ష నిర్వహించారు. తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాల జోన్–ఎక్స్ పరిధి 72 కేవీకేల్లో జమ్మికుంట కేవీకే(కృషి విజ్ఞాన కేంద్రం)కు మూడో ర్యాంకు వచ్చింది. రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్ సాధించింది. హైదరాబాద్ జోన్–ఎక్స్ డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్ మీరా, తమిళనాడు అవినాశలింగం విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ భారతి హరిశంకర్‌ల చేతుల మీదుగా జమ్మికుంట కేవీకే హెడ్, సీనియర్ శాస్త్రవేత్త వెంకటేశ్వర్లు ప్రశంస పత్రం అందుకున్నారు. కేవీకే ప్రధాన కార్యదర్శి విజయగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రశంసపత్రం మరింత బాధ్యత పెంచిందని హర్షం వ్యక్తం చేశారు.
ఇల్లందకుంట: ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని కరీంనగర్ డివిజన్ దేవాదాయధశాఖ పరిశీలకుడు సత్యనారాయణ పర్యవేక్షణలో శనివారం లెక్కించారు. 4నెలల 14 రోజులకు గాను 23 హుండీలను లెక్కించారు. రూ.8,59,861 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఇన్‌చార్జి ఈవో కందుల సుధాకర్ తెలిపారు. దేవస్థాన కమిటీ చైర్మన్ ఇంగిలే రామారావు, ధర్మకర్తలు మూడేత్తుల మల్లేశ్ యాదవ్, గోపాల్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, నాగరాజు, అర్చకులు శేషం వంశీధరాచార్యులు, నవీన్‌శర్మ పాల్గొన్నారు.

ప్రభుత్వ భూమిలోని భవనం స్వాధీనం

ప్రభుత్వ భూమిలోని భవనం స్వాధీనం

ప్రభుత్వ భూమిలోని భవనం స్వాధీనం

ప్రభుత్వ భూమిలోని భవనం స్వాధీనం