
జీపీవోలొస్తున్నారు
కరీంనగర్ అర్బన్: గ్రామ పాలన అధికారు(జీపీవో)లొస్తున్నారు. నాలుగైదు రోజుల్లో విధుల్లో చేరనుండగా రెవెన్యూ సమస్యలు గాడిన పడనున్నాయి. భూ రికార్డుల నిర్వహణలో ఇక వీరే కీలకం కానున్నారు. 2020 సెప్టెంబర్‌లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం వీఆర్‌వో వ్యవస్థను రద్దు చేసిన విషయం విదితమే. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త హోదాను సృష్టిస్తూ గ్రామస్థాయి రెవెన్యూ సేవలను పునరుద్ధరించింది. వీఆర్వోల్లో ప్రతిభ గల వారిని గుర్తించి ఈ నెల 5న జీపీవో నియామక పత్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి అందజేశారు. సదరు జీపీవోలను జిల్లాకు అలాట్మెంట్ చేయగా ఈ నెల 8న కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇవ్వనున్నారు.
గ్రామ పాలనలో వీరే కీలకం
పల్లెలు ప్రగతి సాధించాలంటే క్షేత్రస్థాయిలో అన్నిశాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి. గ్రామాల్లో ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ, వైద్య, విద్య.. ఇలా దాదాపు 16 రకాల సిబ్బంది అందుబాటులో ఉన్నారు. రెవెన్యూపరమైన సమస్యల పరిష్కారానికి, భూముల హద్దుల గుర్తింపునకు గతంలో సేవలందించిన వీఆర్వో, వీఆర్‌ఎలను తొలగించారు. వారి స్థానాన్ని భర్తీ చేయడంతోపాటు గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు గ్రామ పాలనాధికారి వ్యవస్థను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. జీపీవో పోస్టుల భర్తీకి గతంలో రెవెన్యూశాఖలో వీఆర్వోలు, వీఆర్‌ఎలుగా పనిచేసిన వారిలో ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించి రెండు విడతలుగా పరీక్షలు నిర్వహించగా జిల్లా పరిధిలో 163 మంది ఉత్తీర్ణత సాధించారు.
జీపీవోల జాబ్‌చార్ట్ ఇదే
ప్రభుత్వ, ప్రైవేటు భూములు, సర్వే నంబర్లు, చెరువులు, కుంటలు, శిఖం భూములు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పర్యవేక్షణ.. తదితర ప్రభుత్వ పరిపాలన వ్యవహారాలన్నీ జీపీవోలు పర్యవేక్షిస్తారు. జూనియర్ అసిస్టెంట్ క్యాడర్‌లో ఈ పోస్టులను ప్రభుత్వం కొత్తగా తీసుకురాగా 11 రకాల జాబ్‌చార్ట్‌ను అనుసరించనున్నారు. భూభారతి చట్టంలో భాగంగా భవిష్యత్లో ప్రతి రిజిస్ట్రేషన్–మ్యుటేషన్‌కు గ్రామ పటం జోడించడంలో వీరు సహాయకారిగా పనిచేయనున్నారు. గ్రామ స్థాయిలో భూఖాతా (విలేజ్ ఎకౌంట్) ని ర్వహణ, పహాణీల నమోదు, రెవెన్యూ మాతృ ద స్త్రం నిర్వహిస్తారు. అన్నిరకాల భూముల నిర్వహణ, మార్పు చేర్పులు చేస్తారు. లావోణి, లసైన్డ్, దేవాదాయ, వక్స్, ప్రభుత్వం సేకరించిన భూ ముల నిర్వహణ చూస్తారు. ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, నీటివనరుల కింద భూములను పరిరక్షిస్తారు. భూమి ఖాతాల నిర్వహణ, మా ర్పు, చేర్పుల నమోదు చేస్తారు. భూ సర్వేకు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే సేవలందిస్తారు. ప్ర కృతి విపత్తులు వాటిల్లితే నష్టం అంచనా వేస్తా రు. గ్రామస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాల కు అర్హుల ఎంపికలో విచారణ చేస్తారు. జనన, మరణ విచారణలు నిర్వహిస్తారు. ఎన్నికల సమయంలో గ్రామస్థాయిలో సహకారం. వివిధ ప్ర భుత్వశాఖల మధ్య సమన్వయంగా పనిచేస్తారు.
జిల్లాలో మొత్తం గ్రామాలు: 318
కార్పొరేషన్: 01(కరీంనగర్)
మున్సిపాలిటీలు: 03(హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి)
సాగు విస్తీర్ణం: 3,38,450 ఎకరాలు
వ్యవసాయేతర భూమి: 33,007ఎకరాలు
ప్రభుత్వ భూమి: 40,366
వక్ఫ్‌భూములు: 517 ఎకరాలు
అటవీ భూములు: 1,748 ఎకరాలు
ఖాతాల సంఖ్య: 1,92,687
మొత్తం సర్వేనంబర్లు: 3,51,545
రెవెన్యూ డివిజన్లు: 02(కరీంనగర్, హుజూరాబాద్)
రెవెన్యూ క్లస్టర్లు: 255
రెవెన్యూ గ్రామాలు: 205
జీపీవోలు: 163