
ఇయర్ ఫోన్స్ వాడొద్దు
ప్రమాదం ఇలా..
ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగింది. ప్రజలు మరింత సౌలభంగా ఉండేందుకు వీలుగా ఇయర్ ఫోన్స్ వాడుతున్నారు. ప్రస్తుతం వచ్చిన ఇయర్ ఫోన్స్‌లో శబ్ద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. చెవి నొప్పితో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. సంపూర్ణ ఆరోగ్యం కోసం ఇయర్ ఫోన్‌న్లను తక్కువ వాడటమే ఉత్తమం.
– రాజు, ఈఎన్‌టీ వైద్యుడు, హుజూరాబాద్
‘హుజూరాబాద్‌కు చెందిన శ్రావణికి (పేరు మార్చాం) ఫోన్‌లో రీల్స్ చూడడం.. పాటలు వినడం అలవాటు. ఎప్పుడు చూసినా ఇయర్ ఫోన్లు పెట్టుకొనే కనిపిస్తుంది. దీంతో ఆమె కర్ణభేరి దెబ్బతింది. రెండు చెవులు వినిపించడంలేదు. మెదడులో నరాలు దెబ్బతిన్నాయి. అప్పుడప్పుడు మతిస్థిమితం లేకుండా వ్యవహరిస్తోంది. డాక్టర్లను సంప్రదిస్తే అతిసీపం నుంచి శబ్ధం.. అంటే ఇయర్ ఫోన్స్ లాంటివి వాడితే ఇలాంటి ఇబ్బందులు వస్తాయని తెలిపారు. ఇప్పుడామెది ఏమీ వినలేని పరిస్థితి.’
‘సిరిసిల్లకు చెందిన పరమేశ్‌కు(పేరు మార్చాం) ఇయర్ ఫోన్స్ పెట్టి సెల్‌ఫోన్‌లో పాటలు వినడం, సినిమాలు చూడడం అలవాటు. క్రమంగా ఆయన వినికిడి శక్తిని కోల్పోయాడు. చెవిలో అతిదగ్గరినుంచి శబ్దం వినడంతో కర్ణభేరికి ఇబ్బందిగా మారిందని వైద్యులు చెప్పారు. ఇప్పుడాయనా చెవికి వినికిడి పరికరం అమర్చుకున్నాడు. లేదంటే ఆయన ఎలాంటి శబ్ధం వినలేడు’.
చెవి ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు
కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలంలో వినికిడి సమస్య తలెత్తుతుంది. అందుకే లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని వైద్యులు సూచిస్తున్నారు.
చెవుల్లో శబ్దాల హోరు
చిన్న శబ్దాలను కూడా వినలేకపోవడం
చెవుల్లో తరచూ ఇన్‌ఫెక్షన్లు, నొప్పి
అధికంగా గులిమి ఏర్పడడం
చెవిపై ఒత్తిడి పెరగడంతో
వర్దిగో సమస్య

ఇయర్ ఫోన్స్ వాడొద్దు