
అనిల్‌కుమార్‌కు పురస్కారం
కరీంనగర్ కల్చరల్: త్రివర్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బిర్లా ప్లానిటోరియం భాస్కర ఆడిటోరియంలో ఆదివారం దక్షిణ భారత భాషా కవి సమ్మేళనం నిర్వహించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు డా.నందిని సిధారెడ్డి చేతుల మీదుగా కరీంనగర్‌కు చెందిన కవి కొత్త అనిల్‌కుమార్ ప్రజాకవి కాళోజీ నారాయణరావు సాహిత్య పురస్కారం అందుకున్నారు. అన్నాడి గజేందర్‌రెడ్డికి గుర్రం జాషువా పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఆచార్య కొలకూరి ఇనాక్, ఎమ్మెల్సీ ఇక్బాల్, బైస దేవదాస్, దొమ్మటి శంకర్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన సాహితీవేత్తలు పాల్గొన్నారు.