
ఇల్లు కట్టు.. చిత్రాలు పెట్టు
కరీంనగర్ అర్బన్: ఇందిరమ్మ లబ్ధిదారులకు బిల్లు చెల్లింపులో జాప్యానికి చెక్ పెడుతూ ప్రభుత్వం నూతన విధానం తీసుకొచ్చింది. అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనలో ఆలస్యం చేసినా లబ్ధిదారే ఫొటో అప్‌లోడ్ చేసేలా యాప్‌లో ప్రత్యేక ఆప్షన్ ఇచ్చింది. బిల్లుల కోసం ప్రతిపాదనలు పంపడంలో ఎదురవుతున్న జాప్యాన్ని నివారించేందుకు లబ్ధిదా రుకే చిత్రాలను అప్లోడ్ చేసే అవకాశం కల్పించింది. ఇల్లు నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి నిర్మాణ దశలను గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, మునిసిపాలిటీలో వార్డు అధికారి చిత్రాలను తీసి ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో అప్లోడ్ చేయాలి. అవి గృహనిర్మాణ శాఖ ఏఈ లాగిన్‌కు అటు నుంచి డీఈ, పీడీ తర్వాత కలెక్టర్‌కు వెళ్తాయి. బేస్‌మెంట్ పూర్తయితే రూ.లక్ష, గోడల దశలో మరో రూ.లక్ష, స్లాబు పూర్తయితే రూ.2లక్షలు, రంగులు వేశాక మరో రూ.లక్ష చొప్పున మొత్తం రూ.5 లక్షలు విడతల వా రీగా లబ్ధిదారు బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి. ఈ ప్రక్రియలో ఆలస్యం కావడం, డబ్బులు డి మాండ్ చేస్తుండటంతో చిత్రాలను అప్లోడ్ చేసే అవకాశం లబ్ధిదారుకే ఇ చ్చారు. అధికారులు మళ్లీ ఆయా చిత్రాలు నిజమైనవేనా అని క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతారు.