
పక్కాగా పంటల లెక్క
● మొబైల్ యాప్‌లో వివరాల నమోదు
● క్షేత్రస్థాయిలో పంట.. సాగు విస్తీర్ణం పరిశీలన
● ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్న ఏఈవోలు
● పెద్దపల్లి జిల్లాలో ప్రారంభమైన క్రాప్ బుకింగ్ ప్రక్రియ
మంథనిరూరల్: వానాకాలం సీజన్‌లో సాగు చేసిన పంటల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. క్రాప్‌బుకింగ్‌పై ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేయడంతో వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పంట నమోదు ప్రక్రియ ప్రారంభించారు. మంథని మండలంలోని 35 గ్రామపంచాయతీల్లో ఆయా క్లస్టర్‌ల ఏఈవోలు పంటల నమోదు వివరాలను శరవేగంగా సేకరిస్తున్నారు. వెనువెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో పంటలు, సాగు విస్తీర్ణం లెక్కలు పక్కగా తేలుతాయని భావిస్తున్నారు.
35 పంచాయతీలు.. ఆరు క్లస్టర్లలో..
మంథని మండలంలోని 35 గ్రామపంచాయతీలకు ఆరు క్లస్టర్లను ఏర్పాటు చేశారు. ఒక్కో క్లస్టర్ కింద ఐదు నుంచి ఆరు గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఈ ఆరు క్లస్టర్లలో ఆరుగురు వ్యవసాయ విస్తరణ అధికారులు పంటలను పరిశీలించి ఆన్‌లైన్‌లో పారదర్శకంగా నమోదు చేస్తున్నారు.
ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా..
గత ప్రభుత్వం తొలుత పంటలు, సాగు విస్తీర్ణం వివరాలు సేకరించి ఆ తర్వాత ట్యాబ్‌లలో నమోదు చేసేవారు. ఈసారి అందుకు భిన్నంగా క్షేత్రస్థాయిలో ఏఈవోలు పంట, విస్తీర్ణం పరిశీలించిన తర్వాతే ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.
అన్ని వివరాల సేకరణ..
క్రాప్ బుకింగ్ ప్రక్రియలో రైతుపేరు, సర్వే నంబర్, బ్యాంకు ఖాతా నంబర్, పట్టాదారు పాసుబుక్, ఫోన్ నంబర్‌తోపాటు ఏఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేశారనే వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా పక్కాగా లెక్క ఉండేలా పారదర్శకంగా నమోదు ప్రక్రియను చేపట్టారు.
15 వేల ఎకరాల్లో వరి.. 8 వేల ఎకరాల్లో పత్తి..
మంథని మండలంలో ఈ వర్షాకాలం సీజన్‌లో సుమారు 15 వేల ఎకరాల్లో వరి, 6వేల నుంచి 8 వేల ఎకరాల్లో పత్తి పంట సాగు చేసినట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. అయితే, ప్రస్తుతం చేపట్టిన సర్వే ద్వారా క్రాప్ బుక్‌ంగ్ ద్వారా ఏ ఏ పంటలు ఎంత విస్తర్ణంలో సాగు చేశారనేది పక్కాగా తేలనుంచి.
ప్రభుత్వ ఆదేశాల మేరకు నెలరోజుల్లోగా క్రాప్ బు కింగ్ పూర్తిచేయాల్సి ఉంటుంది. మండలంలోని ఆ రు క్లస్టర్లలో మా సిబ్బంది క్షేత్రస్థాయిలో పంటలు ప రిశీలించి ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేస్తున్నారు.
– అంజనీమిశ్రా, ఏడీఏ, మంథని