
రాజన్న సేవలో ఇస్కాన్ చైర్మన్
వేములవాడ: రాజన్నను దక్షిణ భారతదేశ ఇస్కాన్ ఆలయాల అధ్యక్షుడు, రాజమండ్రి ఇస్కాన్ ఆలయ గురువు సత్య గోపీనాథ్ దాస్ బుధవారం దర్శించుకున్నారు. స్వామి వారికి కోడెమొక్కు చెల్లించుకున్నారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చారు. ఆలయ పర్యవేక్షకులు జి.శ్రీనివాస్‌శర్మ, ప్రొటోకాల్ పర్యవేక్షకులు శ్రీకాంత్‌చార్యులు, సీనియర్ అసిస్టెంట్ బొడుసు మహేశ్ ఉన్నారు.
భార్యను వేధించిన భర్తకు మూడేళ్ల జైలు
ముస్తాబాద్(సిరిసిల్ల): భార్యను వేధింపులకు గురిచేసి మద్యం మత్తులో దాడి చేసిన భర్తకు మూడేళ్ల జైలుతోపాటు రూ.10వేలు జరిమానా విధిస్తూ సిరిసిల్ల ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ప్రవీణ్ తీర్పు వెలువరించారు. ముస్తాబాద్ ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు. ముస్తాబాద్ మండలం గూడెంకు చెందిన సడిమెల రామచంద్రం మద్యం సేవించి తరచూ భార్య కనకవ్వను వేధించేవాడు. 2016 డిసెంబర్ 2న కనకవ్వపై భర్త రామచంద్రం టార్చిలైట్‌తో దాడి చేశాడు. భర్త వేధింపులు భరించలేని భార్య ముస్తాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రామచంద్రంపై కేసు నమోదు చేసిన అప్పటి ఎస్సై ప్రవీణ్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. రామచంద్రంపై నేరం రుజువు కావడంతో మేజిస్ట్రేట్ ప్రవీణ్ మూడేళ్ల జైలుశిక్ష, రూ.10వేలు జరిమాన విధిస్తు తీర్పు వెలువరించారని ఎస్సై వివరించారు.
ఇద్దరి రిమాండ్
వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలోని సీతారాంనాయక్‌తండాకు చెందిన బానోత్ శ్రీనివాస్ నాలుగు రోజుల క్రితం చంద్రుని కర్రతో కొట్టాడు. జవహర్‌లాల్ నాయక్‌తండాకు చెందిన అజ్మీర రాజు 2021లో ఫారెస్ట్ అధికారుల విధులకు ఆటంకం కలిగించాడు. ఫారెస్ట్ అధికారులపై దాడి చేయడంతో వారెంట్ జారీ చేశారు. ఈమేరకు ఇద్దరు బానోత్ శ్రీనివాస్, అజ్మీర రాజును బుధవారం రిమాండ్‌కు తరలించారు.