
నగరంలో నిరుపయోగ విద్యుత్ స్తంభాల తొలగింపు
కరీంనగర్ కార్పొరేషన్/కరీంనగర్ కల్చరల్: నగరంలో నిరుపయోగంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగిస్తున్నట్లు కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ తెలిపారు. శివ థియేటర్ ప్రాంతంలో ఉపయోగంలో లేని విద్యుత్ స్తంభాలను శనివారం తొలగించారు. ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ మేక రమేశ్‌తో కలిసి కమిషనర్ స్తంభాల తొలగింపును పర్యవేక్షించారు. నగరంలో ఉపయోగంలో లేకుండా వృథాగా ఉన్న విద్యుత్‌స్తంభాలను తొలగించేందుకు స్పెషల్‌డ్రైవ్ చేపట్టామన్నా రు. ఏడీఈ శ్రీనివాస్, పర్యావరణ ఇంజినీర్ స్వామి పాల్గొన్నారు.
నూతన గ్రంథాలయ భవనం పరిశీలన
కరీంనగర్‌లో స్మార్ట్‌సిటీ నిధులతో నిర్మిస్తున్న నూతన గ్రంథాలయ భవనాన్ని శనివారం మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్ పరిశీ లించారు. నాణ్యతతో పాటు వేగంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
‘అమృత్’ పనుల్లో వేగం పెంచాలి
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో అమృత్ ప థకం కింద చేపట్టిన పనుల్లో వేగం పెంచాలని సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్, అమృత్–2 ప్రాజెక్ట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేకాధికారి బోనగిరి శ్రీనివాస్ ఆదేశించారు. శనివారం నగరానికి వచ్చిన ఆయన అమృత్– 2 లో భాగంగా జరుగుతున్న పనులను పరిశీలించారు. ప్రజారోగ్యశాఖ డివిజన్ కార్యాలయంలో పనులపై సమీక్ష నిర్వహించారు. పనులు ఆలస్యమవుతున్నాయన్నారు. వేగం పెంచాలని ఆదేశించారు. పైప్‌లైన్‌లు వేయాలన్నారు. కార్మికుల సంఖ్య కూడా తక్కువగా ఉందని, పెంచుకోవాలని సూచించారు.
విద్యుత్ ప్రమాదాల నివారణకు సహకరించాలి
కొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ ప్రమాదాల ని వారణే లక్ష్యంగా ముందుకెళ్తున్న విద్యుత్ సంస్థకు రైతులు, వినియోగదారులు సహకరించాలని టీజీఎన్‌పీడీసీ ఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈ మేక రమేశ్‌బాబు విజ్ఞప్తి చేశారు. ప్రమాదకరంగా ఉన్న స్తంభాలు, వైర్ల సమస్యలను మీ పరిధిలోని సెక్షన్ ఆఫీసర్ లేదా గ్రామస్థాయిలో ఉండే లైన్‌మెన్‌కు సమాచారం ఇచ్చి జీరో యాక్సిడెంట్ లక్ష్యంలో భాగస్వామ్యులు కావాలన్నారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రజల సహకారం కావాలని కోరారు. ఇంటిలోకి వచ్చే సర్వీస్ వైర్ ఎటువంటి అతుకులు లేకుండా, ఇనుప రేకులగుండా వెళ్లకుండా చూడాలని తెలిపారు. గృహాలకు నాణ్యమైన వైరింగ్ వాడాలన్నారు. పశువులకాపరులు పశువులు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్ల దగ్గరికి వెళ్లకుండా చూడాలని సూచించారు. విద్యుత్ సమస్య తలెత్తితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1912ను సంప్రదించాలని కోరారు.
చట్టాలపై పట్టు సాధించాలి
కరీంనగర్‌క్రైం: పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కొత్తగా వచ్చిన చట్టాలపై పట్టుసాధించాలని డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ డి.శరత్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు సూచించారు. రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆదేశాలపై డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ డి.శరత్ ఆధ్వర్యంలో శనివారం ఉమ్మడి జిల్లా ప్రాసిక్యూటర్ల సమీక్ష జిల్లాకోర్టులో నిర్వహించారు. ఈ సందర్భంగా శరత్ మాట్లాడుతూ ప్రాసిక్యూటర్లు న్యాయమూర్తుల, న్యాయవాదుల సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. ఉమ్మడిజిల్లాలో క్రిమినల్ కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డ కేసుల సంఖ్య పెరిగిందని, అలాగే కొనసాగించేందుకు కృషి చేయాలన్నారు. జగిత్యాల ఏపీపీ రాజేశ్ ఎస్సీ,ఎస్టీ చట్టం గురించి వివరించారు. ప్రాసిక్యూటర్లు మల్లికార్జున్, చీటి రామకృష్ణారావు, మల్యాల ప్రతాప్, అరెల్లి రాములు, లక్ష్మీ ప్రసాద్, జూలూరు శ్రీరాములు, కుమార్‌గౌడ్, గౌరు రాజిరెడ్డి, గడ్డం లక్ష్మణ్, పెంట శ్రీనివాస్, ఝాన్సీ, మల్లేశం పాల్గొన్నారు.

నగరంలో నిరుపయోగ విద్యుత్ స్తంభాల తొలగింపు

నగరంలో నిరుపయోగ విద్యుత్ స్తంభాల తొలగింపు