
● నేటి తరానికి పరిచయం లేకుండా పోతున్న కట్టుబొట్టు
ఈవెంట్లలోనే..
నాటి తరం కట్టు బొట్టు ఇప్పడు ఫ్యాషన్ ట్రెండ్ అయింది. ప్రత్యేక సందర్భాల్లో నాటి చీరకట్టులో ప్రత్యేకత చాటుకుంటున్నారు. నాటి వస్త్రధారణ నేటి ఈవెంట్స్‌లో సరికొత్త సందర్భ సంప్రదాయ అలంకరణ అయింది.
– పడకంటి ఇందు,
చామ కృష్ణవేణి, కరీంనగర్
‘పంచె కట్టుటలోన ప్రపంచాన మొనగాడు
కండువా లేనిదే గడపదాటని వాడు
పంచ భక్ష్యాలు తన కంచాన వడ్డించ
గోంగూర కోసమై గుటకలేసేవాడు
ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడు తెలుగువాడు
సినారె.. రాసిన ఈ నాలుగు పంక్తుల్లో తెలుగువాడి పంచెకట్టు వైభవాన్ని చాటి చెప్పాయి.
ధోతి ఒక అంచును పైనున్న లాల్చీ కుడి జేబులో పెట్టుకుని కనిపించిన నందమూరి తారకరామారావు తన తెలుగుదనపు ఠీవీని ప్రదర్శించారు. అలాగే వైఎస్ రాజశేఖరరెడ్డి సైతం తనదైన శైలి పంచెకట్టుతో మూర్తీభవించిన తెలుగుదనానికి ప్రతిరూపంగా కనిపించేవారు. తెలుగు వారు ఠీవీగా చాటుకునే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సైతం విదేశీ పర్యటనలు మినహా ఎప్పుడూ పంచె కట్టును వీడింది లేదు’.
– విద్యానగర్(కరీంనగర్)/సిరిసిల్లకల్చరల్
ఎనభై ఏళ్లుగా..
మా పుట్టిల్లు మర్తనపేట. అత్తగారి ఊరు ఇప్పలపెల్లి. పెళ్లయిన నాటి నుంచి ఇదే తరహా గోచీ చీరలే ధరిస్తున్న. 80 ఏళ్లు దాటుతున్నా మరో ఆలోచన లేదు. 18 మూరల చీరను కూడా సులువుగా కట్టుకుంటాం. కష్టం చేసుకుని బతికెటోళ్లకు ఇదే సౌకర్యం. – గొడుగు లచ్చవ్వ, ఇప్పలపల్లి
●
– వివరాలు 8లోu