
అల్ఫోర్స్ ఇ– టెక్నో స్కూల్‌లో బోనాల జాతర
కొత్తపల్లి: కరీంనగర్ భగత్‌నగర్‌లోని అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్‌లో బోనాల జాతర ఉత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. సాంప్రదాయ దుస్తుల్లో విచ్చేసిన విద్యార్థులు బోనాలతో సందడి చేశారు. భగత్‌నగర్ చౌరస్తా నుంచి పాఠశాల వరకు ఊరేగింపు నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
చెస్ టోర్నీలో పతకాలు
ఆలిండియా మూడో ఓపెన్ చెస్ టోర్నీలో కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్ విద్యార్థులు పతకాలు సాధించినట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్‌రెడ్డి తెలిపారు. అయాన్ (5వ తరగతి), ప్రణవ్ ఆదిత్య (9వ), ఆర్ శివనామ శ్రగ్న (6వ), డి.శ్రీతన్ (3వ), ఎండి షయాన్ ఖాన్ (9వ), విహాన్ నాయక్ (5వ), రుద్రాన్స్ (5వ), ఎస్ రావిక్ (6వ), సహ్నయా (3వ) తరగతి కాంస్య పతకాలను కై వసం చేసుకోవడంతో పాటు రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచారని పేర్కొన్నారు. వీరిని గురువారం పాఠశాలలో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.