
మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యం
● చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
గంగాధర: మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలంలోని కురిక్యాలలో గురువారం నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబురాల్లో పాల్గొన్నారు. బ్యాంకు లింకేజీ కింద 328 మహిళా సంఘాలకు రూ.38.20 కోట్లు, 5,273 సంఘాలకు రూ.6.92 కోట్లు, ఆరుగురు సభ్యులకు ప్రమాదబీమా కింద మంజూరైన చెక్కులు, 54 మంది సభ్యులకు లోన్‌బీమా కింద మంజూరైన రూ.48.52 లక్షలు, స్కూల్ యూనిఫామ్‌కు రూ. 20.83 లక్షలు, ఐదు మండల సమైక్యలకు ఆర్టీసీ బస్సుల కోసం రూ.1.54 కోట్ల చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు మహేశ్, రజితశ్రీనివాస్‌రెడ్డి, తిరుమలతిరపతి, ఎల్లేశ్, సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిరుమల్‌రావు పాల్గొన్నారు.
స్మార్ట్‌సిటీ అక్రమాలపై విచారణ జరిపించాలి
కరీంనగర్ కార్పొరేషన్: స్మార్ట్‌సిటీ పనుల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని, మాజీ మేయర్ సునీల్‌రావు ఆస్తులపై ఏసీబీ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ గురువారం నగరపాలకసంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది. పార్టీ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ స్మార్ట్‌సిటీ పనుల్లో అవినీతి జరిగిందన్నారు. సునీల్‌రావు కొంతమంది బినామీ కాంట్రాక్టర్లను ఏర్పాటు చేసుకుని అక్రమాలను ప్రోత్సహించాడని ఆరోపించారు. మేయర్ పదవి పోయాక పనుల్లో అవినీతి జరిగిందని సునీల్‌రావు అనడం దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నారు. సీపీఐ నగర సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులు కటికిరెడ్డి బుచ్చన్న పాల్గొన్నారు. కాగా.. స్మార్ట్‌సిటీ పనులపై ఏమాత్రం అవగాహన లేకుండా తనపై ఆరోపణలు చేస్తున్నారని మాజీ మేయర్ సునీల్‌రావు అన్నారు. స్మార్ట్‌సిటీ బోర్డులో ఉన్న 12మందిలో మేయర్ హోదాలో తాను ఒక సభ్యుడిని మాత్రమేనని తెలిపారు. అవగాహన లేకుండా తనపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యం