
విలువైన సామగ్రి స్వాధీనం
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ రామగుండం–తెలంగాణ ప్రాజెక్టులో చోరీకి గురైన విలువైన సామగ్రిని చాకచక్యంగా స్వాధీనం చేసుకున్నామని ఎన్టీపీసీ ఎస్సై ఉదయ్‌కిరణ్ శుక్రవారం తెలిపారు. విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయని ప్రాజెక్టు హెచ్‌ఆర్ ఏజీఎం బిజయ్‌కుమార్ సిగ్దర్, అధికారులు తమకు ఫిర్యాదు చేశారన్నారు. ఈక్రమంలో తనిఖీలు చేపట్టగా.. మేడిపల్లి సెంటర్ సమీపంలోని ఓ దుకాణంలో సామగ్రి లభించగా, స్వాధీనం చేసుకున్నామన్నారు. దీని విలువ సుమారు రూ.2.80 లక్షల వర కు ఉంటుందని అన్నారు. ఇందులో క్రషర్ హ్యామర్స్ ఉన్నాయని, వీటిని చోరీ చేసిన హరియాణాకు చెందిన వకీల్, ఎన్టీపీసీ ప్రాంతానికి చెందిన అనిల్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఒక ట్రాక్టర్, జేసీబీని సైతం స్టేషన్‌కు తరలించామని పేర్కొన్నారు. ఇనుప సామాను లభించిన దుకాణం యజమాని చాంద్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.
కదలించిన ‘సాక్షి’ కథనం
ఎన్టీపీసీ ప్రాజెక్టులో విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు ‘సాక్షి’లో శుక్రవారం కథనం ప్రచురితమైంది. దీంతో ఎన్టీపీసీ అధికారులు, పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. చోరీని వెలుగులోకి తీసుకువచ్చిన ‘సాక్షి’ని పలువురు అభినందించారు.
● ఎస్సై ఉదయ్‌కిరణ్

విలువైన సామగ్రి స్వాధీనం

విలువైన సామగ్రి స్వాధీనం