
అథ్లెటిక్స్‌లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
మల్యాల(చొప్పదండి): మల్యాల మండలం తాటిపల్లి బాలికల గురుకుల కళాశాలకు చెందిన విద్యార్థులు జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ కనబరిచారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎ.హర్షిత, బి.హారిక, జరా ఫాతిమా ఎంపికయ్యారు. అండర్–14 విభాగంలో ఎ.హర్షిత ప్రథమ, జి.మేదశ్రీ ద్వితీయ, అండర్–18 విభాగం లాంగ్‌జంప్‌లో జరా ఫాతిమా తృతీయ, 1,000 మీటర్ల పరుగులో బి.హారిక ప్రథమ, షాట్‌పుట్‌లో జరా ఫాతిమా ప్రథమ, ఎస్.అక్షయ రెండో స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రిన్సిపాల్ మానస, పీఈటీ మధులిక అభినందించారు.
గంజాయి పట్టివేత
● పోలీసుల అదుపులో ఒకరు, మరో ఇద్దరు పరార్
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్ పరిధిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా 100 గ్రాముల గంజాయి పట్టుబడినట్లు ఎస్సై ఉదయ్‌కిరణ్ తెలిపారు. గురువారం రాత్రి మేడపిల్లి సెంటర్ ప్రాంతంలో వాహనాల తనిఖీ చేస్తుండగా స్కూటిపై వెళ్తున్న వ్యక్తిని ఆపి ధ్రువీకరణ పత్రాల కోసం తనిఖీ చేశామన్నారు. ఈక్రమంలో 100 గ్రాముల గంజాయి లభించిందన్నారు. వాహనదారును అదుపులోకి తీసుకోగా, మరోఇద్దరు పరారయ్యారని వివరించారు. పట్టుకున్న వ్యక్తి స్థానిక లక్ష్మీపురం గ్రామానికి చెందిన బొల్లి అజయ్ అని వివరించారు. ఒక స్కూటితో పాటు మరోవాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు విచారణ చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
రెండు ద్విచక్ర వాహనాల చోరీ
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపు యజమాని ప్రణయ్‌కు చెందిన పల్సర్ బైక్, పద్మనగర్‌కు చెందిన గాజుల మహేశ్‌కు చెందిన సీడీ డీలర్స్ బైక్‌లను గురువారం రాత్రి దొంగిలించినట్లు తంగళ్లపల్లి ఎస్సై ఉపేంద్రాచారి తెలిపారు. ద్విచక్రవాహనాలను రాత్రిపూజ ఇంటి ఎదుట పార్కింగ్ చేయగా దుండగులు ముసుగులు ధరించి దొంగతనానికి పాల్పడ్డారని అన్నారు. బైర్ చోరీ చేస్తుండగా పక్కనే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయిందని తెలిపారు. ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.
డ్రైనేజీలో పసికందు మృతదేహం
● ఆందోళనకు గురైన స్థానికులు
గోదావరిఖని: డ్రైనేజీలో పసికందు మృతదేహం కనిపించడంతో స్థానికులు ఆందోళనకు గురైయ్యారు. స్థానిక రాజ్యలక్ష్మికాలనీ కమాన్‌బోర్డు వద్ద డ్రైనేజీలో శుక్రవారం పసికందు మృతదేహం తేలియాడుతూ కనిపించింది. ఈవిషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం గదిలో భద్రపర్చారు. చనిపోయిన తర్వాత నీటిలో పడేశారా? లేక ప్రాణాలతో ఉండగానే పడేయంతో చనిపోయిందా? అనే విషయం తేలాల్సిఉంది. సమీపంలోనే ప్రభుత్వ ఆస్పత్రి ఉండటంతో.. అందులో చనిపోయిన శిశువును తీసుకొచ్చి డ్రైనేజీలో పడేసి ఉంటారని భావిస్తున్నారు. మరోవైపు.. పూడ్చిపెట్టిన శవాన్ని కుక్కలు లాక్కెళ్లడంతో డ్రైనేజీలో పడిఉంటుందని కూడా పేర్కొంటున్నారు. మున్సిపల్ అధికారి ఇచ్చి న ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ ఎస్సై రమేశ్ కేసు నమోదుకున్నారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ఎల్లారెడ్డిపేట: రాచర్లబొప్పాపూర్‌కు చెందిన వరుస దేవానందం (62) చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవానందం ఈనెల 15న తన వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగగా కుటుంబ సభ్యులు మండలకేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజా మున మృతిచెందాడు. మృతుడి భార్య రాజమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్‌రెడ్డి పేర్కొన్నారు.

అథ్లెటిక్స్‌లో గురుకుల విద్యార్థుల ప్రతిభ

అథ్లెటిక్స్‌లో గురుకుల విద్యార్థుల ప్రతిభ