
బీజేపీలో వ్యక్తి పూజ, గ్రూపులు ఉండవు
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
జమ్మికుంట: బీజేపీ పార్టీలో వ్యక్తి పూజ, గ్రూపులు ఉండవని, ప్రతీ ఒక్కరు పార్టీ జెండా కిందే పని చేస్తారని, హుజూరాబాద్ నియోజకవర్గం బీజేపీలో ఎలాంటి గ్రూపులు లేవని పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జమ్మికుంటలో హుజూరాబాద్ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లో గ్రూపులు ఉంటాయన్నారు. బీజేపీలో కమిట్‌మెంట్‌తో పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం బీజేపీలో వర్గాలు, గ్రూపులు లేవన్నారు. పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా పనిచేసే వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదన్నారు. పార్టీ కోసం పని చేసే వారికి గుర్తింపు, ప్రాధాన్యం ఉంటుందన్నారు. హుజూరాబాద్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్‌గా మాడ గౌతంరెడ్డికి సముచిత స్థానం ఇచ్చామన్నారు. వ్యక్తి కోసం పని చేస్తే ప్రోత్సహించే ప్రసక్తి లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో అందరికీ అవకాశం కల్పిస్తామని తెలిపారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్‌రావు, జిల్లా కార్యదర్శులు నర్సింహరాజు, బింగి కరుణాకర్, మున్సిపల్ మాజీ చైర్మన్ శీలం శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధులు ముత్యంరావు, శోభన్‌బాబు, ఓబీసీ, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆకుల రాజేందర్, మాడుగూరి సమ్మిరెడ్డి పాల్గొన్నారు.