
సీపీ గౌస్ ఆలం
విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
కరీంనగర్‌క్రైం: విధుల్లో అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం సూచించారు. శుక్రవారం కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. సీఐ నిరంజన్‌రెడ్డి కమిషనర్‌కు స్వాగతం పలికారు. సీపీ సిబ్బందికి అందించిన కిట్లను తనిఖీ చేసి, వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. సిబ్బందితో మాట్లాడి, వారికి కేటాయించిన విధులు, రికార్డుల నిర్వహణ, సీసీటీఎన్‌ఎస్‌లో నమోదైన కేసుల వివరాలను సక్రమంగా పొందుపరచాలని సూచించారు. ఎఫ్‌ఐఆర్ ఇండెక్స్‌ను పరిశీలించి, పెండింగ్ కేసులపై సమీక్ష జరిపి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నూతనంగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లు అన్ని రకాల విధులను నేర్చుకోవాలన్నారు. టౌన్ ఏసీపీ వెంకటస్వామి, కొత్తపల్లి ఎస్సై సాంబమూర్తి, రూరల్ ఎస్సైలు లక్ష్మారెడ్డి, నరేశ్ పాల్గొన్నారు.