లైబ్రరీ పనులు పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

లైబ్రరీ పనులు పూర్తి చేయాలి

Jul 18 2025 1:17 PM | Updated on Jul 18 2025 1:17 PM

లైబ్ర

లైబ్రరీ పనులు పూర్తి చేయాలి

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరంలో స్మార్ట్‌సిటీ నిధులతో నిర్మిస్తున్న జిల్లా గ్రంథాలయ నూతన భవనాన్ని త్వరిగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని లైబ్రరీ చైర్మన్‌ సత్తు మల్లేశ్‌ కోరారు. గురువారం నగరపాలకసంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ను కలిసి పనులపై చర్చించారు. పనుల పురోగతిపై ఇరువురు కలిసి ఇంజినీరింగ్‌ అధికారులతో చర్చించారు. భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచి, త్వరగా పూర్తి చేసేలా చూడాలన్నారు.

సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి

హుజూరాబాద్‌రూరల్‌: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని అదనపు కలెక్టర్‌ అశ్విని తానాజీ వాకడే సూచించారు. మండలం చెల్పూర్‌ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని, జెడ్పీ ఉన్నత పాఠశాలను గురువా రం తనిఖీ చేశారు. అందుతున్న సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది హాజరు పట్టిక పరిశీలించారు. ఆరోగ్యమహిళ, శుక్రవారం సభ సేవలపై ఆరా తీశారు. ఉన్నత పాఠశాలను సందర్శించి 9వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. మధ్యా హ్న భోజనం మెనూ ప్రకారం అందడం లేదని తెలుసుకొని హెచ్‌ఎంను మందలించారు. వైద్యాధికారి డాక్టర్‌ మధుకర్‌, ఎంపీడీవో సునీత, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, ఎంపీవో సతీశ్‌ పాల్గొన్నారు.

కేజీబీవీలో డీఈవో విచారణ

శంకరపట్నం: మండలంలోని కేశవపట్నం కేజీబీవీలో గురువారం డీఈవో మొండయ్య విచారణ చేపట్టారు. ఈనెల 15న మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కేశవపట్నం కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేయగా, చపాతీలు చేయిస్తున్నారని, కూరలు రుచి గా లేవంటే వంట మనిషి రేణుక తిడుతోందని విద్యార్థినులు కన్నీళ్లు పెట్టుకున్న విషయం విదితమే. వంట మనిషి రేణుకను సస్పెండ్‌ చేయాలని కోఆర్డినేటర్‌ కృపారాణిని ఎమ్మెల్యే ఆదేశించగా, కృపారాణితో పాటు, డీఈవో మొండయ్య కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో వంట మనుషులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులను విచారించారు.

సహనాన్ని పరీక్షించొద్దు

కరీంనగర్‌ అర్బన్‌: ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తారా లేదా పోరాటమే శరణ్యమా అని టీఎన్జీవోల జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం స్థానిక టీఎన్జీవో భవన్‌లో ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామని అన్నారు. పీఆర్సీ, ఐదు డీఏలు, పెండింగ్‌ బిల్లుల చెల్లింపులో జాప్యం తగదన్నారు. సీపీఎస్‌ రద్దుపై తక్షణం నిర్ణయం తీసుకోవాలని కోరారు.సమస్యలను రాష్ట్ర టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్‌, కార్యదర్శి ముజీబ్‌ హుస్సేన్‌ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. సంఘం జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణ్‌రావు, కేంద్ర సంఘం నాయకులు నాగుల నరసింహస్వామి, రాగి శ్రీనివాస్‌, గూడ ప్రభాకర్‌ రెడ్డి, సర్దార్‌ హర్మీందర్‌సింగ్‌, సందీప్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఆర్టిజన్ల వంటావార్పు

కొత్తపల్లి: ఆర్టిజన్‌ కార్మికుల కన్వర్షన్‌, ఒకే సంస్థలో ఒకే రూల్‌ అమలు చేయాలని కోరుతూ గురువారం కరీంనగర్‌ విద్యుత్‌ భవన్‌ ఎదుట టీవీఏసీ జేఏసీ ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. గత పది నెలలుగా జేఏసీ ఆధ్వర్యంలో నాలుగు విద్యుత్‌ కంపెనీల ఎదుట మహా ధర్మాలు నిర్వహించి నా.. యాజమాన్యం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 23వ తేదీన జరిగే క్యాన్సులేషన్‌ సమావేశంలో సమస్య పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మెరుపు సమ్మెకు వెనకాడబోమని హెచ్చరించారు.

లైబ్రరీ పనులు పూర్తి చేయాలి 1
1/3

లైబ్రరీ పనులు పూర్తి చేయాలి

లైబ్రరీ పనులు పూర్తి చేయాలి 2
2/3

లైబ్రరీ పనులు పూర్తి చేయాలి

లైబ్రరీ పనులు పూర్తి చేయాలి 3
3/3

లైబ్రరీ పనులు పూర్తి చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement