
మానేరు వెలవెల.. రైతన్న విలవిల
వానాకాలం మండు వేసవిని తలపిస్తోంది. ప్రజలకు ఉక్కపోత.. పంటలకు నీటి కొరత వెక్కిరిస్తుండగా, పొలాలు నెర్రలు బారుతు న్నాయి. జలాశయాలు అడుగంటగా రైతులు పంటలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాకు వరప్రదాయిని అయిన లోయర్ మానేరు డ్యాం నీరు లేక వెలవెలబోతోంది. డ్యాం సామర్థ్యం 24.03టీఎంసీలు కాగా ప్రస్తుతం ఆరు టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఔట్ ఫ్లో 212క్యూసెక్కులు కాగా ఇన్‌ఫ్లో శూన్యం. సాగునీటికి ఇబ్బంది ఏర్పడుతుండడంతో జిల్లాలోని పలువురు రైతులు వ్యవసాయ బావుల్లో క్రేన్ల సాయతంతో పూడికలు తీస్తున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్

మానేరు వెలవెల.. రైతన్న విలవిల