
అంబేడ్కర్, మోదీ స్ఫూర్తితో రాణించాలి
హుజూరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేయాల నే ఆలోచనకు కారణం ప్రజా సంగ్రామ యాత్రేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. హుజూరాబాద్ ప్ర భుత్వ హైస్కూల్ గ్రౌండ్‌లో గురువారం పదోతరగతి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ప్రజా సంగ్రామయాత్రలో కాళ్లకు చెప్పులు లేకుండా ఎంతో మంది పిల్లలు ఎండలో నడుస్తూ పాఠశాలలకు వెళ్తున్న దృశ్యాలను చూశానన్నారు. పిల్లలు కష్టపడొద్దనే ఆలోచనతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గపరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదివే విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల మొట్ట మొదటి ఆస్తి సైకిల్ అని, ఇది ప్రధాని నరేంద్రమోదీ ఇస్తున్న గిఫ్ట్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇంటి నుంచి చాలా దూరం నడిచి వెళ్తున్నారని, టెన్త్ క్లాస్ పిల్ల లు ప్రత్యేక తరగతులు కోల్పోతున్నారని తెలి పారు. సైకిళ్లు అందించడం ద్వారా సమయానికి పాఠశాలకు వెళ్తారన్నారు. విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నతస్థానానికి చేరుకుంటారని, ఇందుకు బాబాసాహెబ్ అంబేడ్కరే ఉదాహరణ అన్నారు. నరేంద్రమోదీ చాయ్ అమ్ముకుంటూ ఎదిగిన నాయకుడని గుర్తుచేశారు. త్వరలోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్‌కేజీ నుంచి 6వ తరగతి వరకు ‘మోదీకిట్స్’ పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులతో కలిసి సైకిల్ తొక్కారు. అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, డీఈవో శ్రీరాం మొండయ్య, వాసంతి, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
విద్యార్థుల మొదటి ఆస్తి సైకిల్
సద్వినియోగం చేసుకుని బాగా చదువుకోండి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్
‘బండి’కి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో 24న విచారణ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కై ్లమాక్స్‌కు చేరింది. బీఆర్‌ఎస్ పాలనలో ఫోన్లు ట్యాప్ అయ్యాయనే అంశంపై విచారణ జరుపుతున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నాటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌కు నోటీసులు జారీ చేశారు. సంజయ్‌తో పాటు ఆయన పీఆ ర్వో పసునూరు మధు, పీఏ బోయినపల్లి ప్రవీణ్‌రావు, మాజీ పీఏ పోగుల తిరుపతికి నోటీసులు అందించారు. ఈనెల 24న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని దిల్‌కుష్ ప్రభుత్వ అతిథి గృహంలో విచారణ జరపాలని నిర్ణయించారు. కొద్దిరోజుల క్రితమే సంజయ్ వ్యక్తిగత డ్రైవర్ రమేశ్‌ను సిట్ పోలీసులు విచారణకు పిలిచి స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్న సంగతి విదితమే.