
కేడీసీసీబీకి దేశవ్యాప్త కీర్తి
కరీంనగర్ అర్బన్/చొప్పదండి: కేడీసీసీబీ సేవలకు మరో అవార్డు వరించింది. గ్రామీణ రుణ పంపిణీ, సహకార పాలన, ఆర్థిక చేయూతలో ఉత్తమ పనితీరు కనబర్చిన జిల్లా కేంద్ర సహకార బ్యాంకుగా నిలిచింది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన నాబార్డ్ వ్యవస్థాపక వేడుకల్లో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేడీసీసీబీ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు, సీఈవో సత్యనారాయణరావు కు అవార్డు అందజేశారు. బెస్ట్ ఫర్ఫార్మెన్స్ పీఏసీఎస్ అవార్డును చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అందుకుంది. సంఘం చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, సీఈవో కళ్లెం తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్ ముద్దం మహేశ్ అవార్డు తీసుకున్నారు. జిల్లా సహకార అధికారి రామానుజాచారి, బ్యాంకు సీఈవో సత్యనారాయణరావుకు కృతజ్ఞతలు తెలిపారు.
మహాధర్నాకు తరలిన బీఆర్‌ఎస్ శ్రేణులు
కరీంనగర్: చట్టసభల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు కోసం బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లో తలపెట్టిన మహాధర్నాకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధ్వర్యంలో కరీంనగర్ నియోజకవర్గం నుంచి 500మంది తరలివెళ్లారు. గంగుల కమలాకర్ మాట్లాడుతూ రాను న్న స్థానికసంస్థల ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే కాంగ్రెస్ పార్టీ బీసీ జపం చేస్తోందన్నారు.
క్రిప్టో మోసాలపై కఠిన చర్యలు చేపట్టాలి
కరీంనగర్‌టౌన్: క్రిప్టో కరెన్సీ పేరుతో రూ.వందల కోట్ల మోసాలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని బీజేపీ నేత, మాజీ మేయర్ యాదగిరి సునీల్‌రావు అన్నా రు. ‘సాక్షి’ దినపత్రికలో వస్తున్న వరుస కథనా లకు స్పందించిన సునీల్‌రావు మంగళవారం కరీంనగర్‌లో మాట్లాడారు. జిల్లాలో జరిగిన రూ.400కోట్ల క్రిప్టో మోసంలో కొంత మంది పెద్ద రాజకీయ నాయకులు ఉన్నట్లు వార్తలు రావడం జరిగిందన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చాలా మంది బాధితులకు ప్రామిసరీ, బాండ్ పేపర్లు, బ్లాంక్ చెక్కులను రాసి ఇచ్చి మోసాలకు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపారు. నాయకులు చంద్రమౌళి, శ్రీనివాస్, మహేశ్, రాజశేఖర్, సంతోష్, వెంకటయ్య పాల్గొన్నారు.
సురక్షిత డ్రైవింగ్‌పై శిక్షణ
విద్యానగర్: కరీంనగర్ బస్‌స్టేషన్ ఆవరణలో కరీంనగర్ రీజియన్‌లోని 11 డిపోలకు చెందిన 51 మంది ఆర్టీసీ డ్రైవర్లు, అద్దెబస్సు డ్రైవర్లు, జేబీఎం డ్రైవర్లకు మంగళవారం సురక్షిత డ్రై వింగ్‌పై రీజినల్ మేనేజర్ బి.రాజు, డిప్యూటీ రీజినల్ మేనేజర్ (ఆపరేషన్స్) ఎస్.భూపతిరెడ్డి, కరీంనగర్–2 డిపో మేనేజర్ మామిడాల శ్రీనివాస్ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎక్కువ ప్రమాదాలు మానవ తప్పిదాలతోనే జరుగుతున్నాయని, డ్రైవింగ్ సమయంలో ఏకాగ్రత పాటించాలని సూచించారు.

కేడీసీసీబీకి దేశవ్యాప్త కీర్తి

కేడీసీసీబీకి దేశవ్యాప్త కీర్తి

కేడీసీసీబీకి దేశవ్యాప్త కీర్తి