కీర్తి మెడికల్ స్టోర్స్ ప్రారంభం
కరీంనగర్: కీర్తి మెడికల్స్ 25వ బ్రాంచ్‌ను కరీంనగర్‌లో శుక్రవారం ప్రారంభించారు. శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఉమేశ్‌కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి, ఐఎంఏ ప్రెసిడెంట్ ఎనమల నరేశ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కీర్తి మెడికల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ తిరుపతిరెడ్డి వారికి సత్కరించారు. కరీంనగర్ ప్రజలకు కీర్తి మెడికల్స్ 24గంటలు సర్వీస్ అందుబాటులో ఉంటుందన్నారు. 30వేల రకాల మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. కరీంనగర్ ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.
బెల్లంపానకం ధ్వంసం.. రూ.లక్ష జరిమానా
ముత్తారం(మంథని): అడవిశ్రీరాంపూర్, ఖమ్మంపల్లి అటవీ ప్రాంతాల్లోని నాటుసారా స్థావరాలపై శుక్రవారం దాడులు చేశామని మంథని ఎకై ్సజ్ సీఐ రాకేశ్ కుమార్ తెలిపారు. సిబ్బంది రాజేందర్, శ్రీను, రఘురాం, రవి ఆధ్వర్యంలో దాడులు చేసి 200 లీటర్ల బెల్లం పానకాన్ని పారబోశామన్నారు. అలాగే ఓడెడ్– అమ్రబాద్ ప్రాంతంలో నాటుసారా విక్రయిస్తూ పట్టుబడిన ఇద్దరికి రూ.లక్ష జరిమానా విధించడంతోపాటు తహసీల్దార్ మధూసూదన్‌రెడ్డి ఎదుట నిందితులను బైండోవర్ చేసినట్లు సీఐ వివరించారు.
వివాహితపై లైంగికదాడికి యత్నం
● నిందితుడిపై కేసు
రామగుండం: అంతర్గాం మండలంలోని ఓ ప్రాంతానికి చెందిన ఓ వివాహితపై అదే ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు లైంగికదాడికి యత్నించిన ఘటనపై ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై వెంకటస్వామి కథనం ప్రకారం.. ఓ వివాహిత మంచిర్యాలలోని ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి అక్కడకు రోజూవెళ్లి వస్తున్నారు. కొంతకాలంగా అదేప్రాంతానికి చెందిన పూదరి సత్తయ్యగౌడ్ ఆమెకు తరచూ ఫోన్‌చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. అంతేకాదు.. ఈనెల ఒకటో తేదీన ఎవరూ లేనిసమయంలో ఏకంగా ఇంట్లోకి ప్రవేశించి తన కోరిక తీర్చాలని వేధించాడు. దీంతో బాధితురాలు ఒక్కసారిగా కేకలు వేసింది. దీంతో నిందితుడు పారిపోతూ.. ఈ విషయం ఎవరికై నా చెబితే చంపేస్తానని వివాహితను బెదిరించాడు. ఎలాగోలా ధైర్యం చేసిన బాధితరాలు పోలీసులకు ఫిర్యాదు చేసిశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై వివరించారు.
కీర్తి మెడికల్ స్టోర్స్ ప్రారంభం


