ఏ–ఫాం.. బీ– ఫాం అంటే?
కరీంనగర్ అర్బన్: ఎన్నికలొచ్చాయంటే ఏ–ఫాం, బీ–ఫాం పదాలు చర్చకొస్తుంటాయి. పార్టీ తరఫున ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేసే పత్రమే బీ–ఫాం. తమ పార్టీ నుంచి ఫలానా వ్యక్తి పోటీపడుతున్నారని, పార్టీ గుర్తు కేటాయించాలని అభ్యర్థించడమే ఈ పత్రం ముఖ్య ఉద్దేశం. ఇక ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థిని ధ్రువీకరించేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్రస్థాయిలో ఒకరికి అధికారం అప్పగిస్తారు. ఈ ప్రక్రియనే ఏ–ఫాం కాగా.. అధికారం పొందిన వ్యక్తి అభ్యర్థికి బీ–ఫాం జారీ చేస్తారు. రాష్ట్రస్థాయి గుర్తింపు పొందిన పార్టీ అధ్యక్షుడు తాను లేదా మరొకరికి లేదా జిల్లాస్థాయిలో ఒకరికి బీ–ఫాం జారీ చేసే అధికారాన్ని అప్పగిస్తుందని ఏ–ఫాం సూచిస్తుంది. ఏ–ఫాం ద్వారా అఽధికారం పొందిన వ్యక్తి పోటీచేసే అభ్యర్థికి బీ–ఫాం ఇస్తారు. ఏ–ఫాం, బీ–ఫాం పత్రాలు నామినేషన్ దాఖలు సమయంలో లేదా నామినేషన్ చివరి రోజు మధ్యాహ్నం 3గంటల్లోగా సంబంధిత రిటర్నింగ్ అధికారికి అందించాలి.