శరీరాన్ని స్ప్రింగ్‌, బొంగరంలా మెలికలు తిప్పేస్తున్నారు..

- - Sakshi

యోగా పోటీల్లో క్రీడాకారుల ప్రతిభ!

రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటుతామని ధీమా..

జాతీయస్థాయిలో పతకాలు సాధించడమే లక్ష్యం!

కరీంనగర్‌: ప్రస్తుతం యోగా దైనందిన జీవితంలో ఆరోగ్యానికి ఔషధంలా దోహదపడుతుంది. కొందరు యోగాతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంటే. ఇక్కడ కనిపిస్తున్న క్రీడాకారులు మాత్రం ప్రతీరోజు యోగా సాధన చేస్తూ దేశానికి పతకాలు సాధించే క్రీడాకారులుగా తయారవుతామని అంటున్నారు. కరీంనగర్‌ జిల్లా యో గా సంఘం ఆధ్వర్యంలో మానేరు సెంట్రల్‌ స్కూల్‌ వేదికగా రాష్ట్ర స్థాయి యోగా పోటీలు ప్రారంభమయ్యాయి.

పోటీలకు అధి క సంఖ్యలో క్రీడాకారులు హాజరై ప్రతిభ చాటుతున్నా రు. శరీరాన్ని స్ప్రింగ్‌, బొంగరంలా మెలికలు తిప్పుతూ యోగాసనాలు వేసి, ఆకట్టుకుంటున్నారు. యోగాలో మేం రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం సాధించాం... జాతీయ స్థాయిలో పతకాలు సాధించడమే లక్ష్యమంటున్న పలువురు క్రీడాకారుల అభిప్రాయాలు వారి మాటల్లోనే..

యోగా అంటే ఇష్టం..
యోగా చేయడమంటే చాలా ఇష్టం. సోషల్‌ మీడియా ద్వారా యోగాసనాలు ప్రాక్టీస్‌ చేశాను. ఏడాదిలోనే పూర్తి స్థాయిలో యోగాసనాలు సులువుగా వేయగలిగాను. ఇటీవల కరీంనగర్‌లో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో, ఇప్పుడు రాష్ట్రస్థాయి పోటీల్లో ఫెర్మామెన్స్‌ ఇచ్చాను. జాతీయస్థాయికి ఎంపికవుతాననే నమ్మకం ఉంది. 25–30 విభాగంలో పోటీపడ్డాను. – జె ఆమని, సుల్తానాబాద్‌

జాతీయస్థాయిలో పతకం సాధించాలి..
మాది రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారం, దుమాలలో ఇంటర్‌ బైపీసీ చదువుతున్నాను. ప్రస్తుతం 16–18 విభాగంలో పోటీ పడుతున్నాను. గతంలో 9కి పైగా రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని బంగారు, రజత, కాంస్య పతకాలు సాధించాను. పంజాబ్‌లో జరిగిన జాతీయస్థాయి యోగా చాంపియన్‌ షిప్‌ పోటీల్లో పాల్గొన్నాను. ప్రస్తుతం జరుగుతున్న పోటీలకు బాగా ప్రాక్టీస్‌ చేశాను. జాతీయ స్థాయి పోటీల్లో పతకం సాధించడమే లక్ష్యం. – ఎల్‌ రంజిత, అగ్రహారం

పిల్లలకు ప్రాక్టీస్‌ చేయిస్తూ..
మాది హన్మకొండ, యోగా ట్రైనర్‌గా స్కూల్‌లో పిల్లలకు ప్రాక్టీస్‌ చేయిస్తూ ఇటు యోగా కాంపిటీషన్‌కు ప్రిపేరవుతున్నాను. మా అమ్మాయి వర్షిణి యోగా క్రీడాకారిణి. ప్రస్తుతం రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్నాం. ఇదివరకు జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో జరిగిన జాతీయ పోటీల్లో పాల్గొన్నాను. పతకం సాధించడమే లక్ష్యం. – సీహెచ్‌.రమాదేవి, హన్మకొండ

నాలుగుసార్లు పోటీల్లో పాల్గొన్నా..
జాతీయ స్థాయి యోగా పోటీల్లో ఇప్పటివరకు నాలుగుసార్లు పాల్గొన్నాను. ప్రస్తుతం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో యోగా ట్రైనర్‌గా పనిచేస్తున్నాను. పిల్లలకు కోచింగ్‌ ఇస్తూ యోగా పోటీల్లో పాల్గొంటున్నాను. ప్రస్తుతం 21–25 కేటగిరిలో పాల్గొన్నాను. – బి ప్రవీణ, కరీంనగర్‌

Read latest Karimnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top