breaking news
Gymnastic
-
శరీరాన్ని స్ప్రింగ్, బొంగరంలా మెలికలు తిప్పేస్తున్నారు..
కరీంనగర్: ప్రస్తుతం యోగా దైనందిన జీవితంలో ఆరోగ్యానికి ఔషధంలా దోహదపడుతుంది. కొందరు యోగాతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంటే. ఇక్కడ కనిపిస్తున్న క్రీడాకారులు మాత్రం ప్రతీరోజు యోగా సాధన చేస్తూ దేశానికి పతకాలు సాధించే క్రీడాకారులుగా తయారవుతామని అంటున్నారు. కరీంనగర్ జిల్లా యో గా సంఘం ఆధ్వర్యంలో మానేరు సెంట్రల్ స్కూల్ వేదికగా రాష్ట్ర స్థాయి యోగా పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీలకు అధి క సంఖ్యలో క్రీడాకారులు హాజరై ప్రతిభ చాటుతున్నా రు. శరీరాన్ని స్ప్రింగ్, బొంగరంలా మెలికలు తిప్పుతూ యోగాసనాలు వేసి, ఆకట్టుకుంటున్నారు. యోగాలో మేం రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం సాధించాం... జాతీయ స్థాయిలో పతకాలు సాధించడమే లక్ష్యమంటున్న పలువురు క్రీడాకారుల అభిప్రాయాలు వారి మాటల్లోనే.. యోగా అంటే ఇష్టం.. యోగా చేయడమంటే చాలా ఇష్టం. సోషల్ మీడియా ద్వారా యోగాసనాలు ప్రాక్టీస్ చేశాను. ఏడాదిలోనే పూర్తి స్థాయిలో యోగాసనాలు సులువుగా వేయగలిగాను. ఇటీవల కరీంనగర్లో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో, ఇప్పుడు రాష్ట్రస్థాయి పోటీల్లో ఫెర్మామెన్స్ ఇచ్చాను. జాతీయస్థాయికి ఎంపికవుతాననే నమ్మకం ఉంది. 25–30 విభాగంలో పోటీపడ్డాను. – జె ఆమని, సుల్తానాబాద్ జాతీయస్థాయిలో పతకం సాధించాలి.. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారం, దుమాలలో ఇంటర్ బైపీసీ చదువుతున్నాను. ప్రస్తుతం 16–18 విభాగంలో పోటీ పడుతున్నాను. గతంలో 9కి పైగా రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని బంగారు, రజత, కాంస్య పతకాలు సాధించాను. పంజాబ్‌లో జరిగిన జాతీయస్థాయి యోగా చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొన్నాను. ప్రస్తుతం జరుగుతున్న పోటీలకు బాగా ప్రాక్టీస్ చేశాను. జాతీయ స్థాయి పోటీల్లో పతకం సాధించడమే లక్ష్యం. – ఎల్ రంజిత, అగ్రహారం పిల్లలకు ప్రాక్టీస్ చేయిస్తూ.. మాది హన్మకొండ, యోగా ట్రైనర్‌గా స్కూల్లో పిల్లలకు ప్రాక్టీస్ చేయిస్తూ ఇటు యోగా కాంపిటీషన్‌కు ప్రిపేరవుతున్నాను. మా అమ్మాయి వర్షిణి యోగా క్రీడాకారిణి. ప్రస్తుతం రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్నాం. ఇదివరకు జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన జాతీయ పోటీల్లో పాల్గొన్నాను. పతకం సాధించడమే లక్ష్యం. – సీహెచ్.రమాదేవి, హన్మకొండ నాలుగుసార్లు పోటీల్లో పాల్గొన్నా.. జాతీయ స్థాయి యోగా పోటీల్లో ఇప్పటివరకు నాలుగుసార్లు పాల్గొన్నాను. ప్రస్తుతం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో యోగా ట్రైనర్‌గా పనిచేస్తున్నాను. పిల్లలకు కోచింగ్ ఇస్తూ యోగా పోటీల్లో పాల్గొంటున్నాను. ప్రస్తుతం 21–25 కేటగిరిలో పాల్గొన్నాను. – బి ప్రవీణ, కరీంనగర్ -
‘ఫ్లోర్’ ఫైనల్లో అరుణ రెడ్డికి ఏడో స్థానం
ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్లో చివరిరోజు భారత జిమ్నాస్ట్‌లకు నిరాశ ఎదురైంది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఆదివారం జరిగిన మహిళల ఫ్లోర్ ఎక్సర్సైజ్ ఫైనల్లో హైదరాబాద్ అమ్మాయి బుద్దా అరుణ రెడ్డి ఏడో స్థానంలో నిలిచింది. ఆమె 10.833 పాయింట్లు స్కోరు చేసింది. పారలల్ బార్స్ ఫైనల్లో భారత్‌కే చెందిన రాకేశ్ పాత్రా 13.433 స్కోరుతో ఏడో స్థానాన్ని పొందాడు. శనివారం వాల్ట్ ఈవెంట్లో అరుణ రెడ్డి కాంస్యం గెలిచి ఈ మెగా ఈవెంట్లో పతకం నెగ్గిన తొలి భారతీయ జిమ్నాస్ట్‌గా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. Creates History By Clinching At The Gymnastics World Cup -
కొండగాలి తిరిగింది
త్రిపుర కొండ ప్రాంతం. పచ్చగా ఉంటుంది. వెచ్చగా ఉంటుంది. పొడిగా ఉంటుంది. తేమగా ఉంటుంది. మొత్తం మీద ప్రకృతి ఒడిలో పెరుగుతున్న అనాథ బిడ్డలా ఉంటుంది. పేరుకు రాష్ర్టమే. ప్రతిష్టకు గ్రామం. ఇప్పుడు ఆ ‘గ్రామం’లో కొండగాలి తిరిగింది. రియో వైపు మళ్లింది. అక్కడి నుంచి ఆ గాలి బంగారు పతకాన్ని మోసుకొచ్చిందా... త్రిపుర ఇక గ్రామం కాదు, రాష్ట్రం కూడా కాదు. దేశ కీర్తిప్రతిష్టల రాజధాని! ఆ రాజధాని నిర్మాణం ఇప్పుడు దీపా కర్మాకర్ అనే అమ్మాయి చేతిలో ఉంది. త్రిపుర చిన్న రాష్ట్రం. పేద రాష్ట్రం. దేశంలో సగం మందికి త్రిపుర ఎక్కడుందో తెలీదు. మిగతా సగానికి అదొక ఈశాన్య రాష్ట్రం అన్నంత వరకే తెలుసు. త్రిపుర ముఖ్యమంత్రి, త్రిపుర గవర్నర్ ఎవరంటే వెంటనే చెప్పేవాళ్లు కూడా అంత విస్తారంగా ఉండకపోవచ్చు. కానీ త్రిపుర అంటే ఇప్పుడు దీప! త్రిపుర ఖ్యాతిజ్వాల.. దీపా కర్మాకర్. త్రిపుర రాజధాని అగర్తలలో పుట్టిన ఈ అమ్మాయి వల్ల అకస్మాత్తుగా త్రిపుర అంతర్జాతీయ నామం అయిపోయింది. అగర్తలలోని అభోయ్ నగర్లో ఉంటున్న దీపకు గత వారం రోజులుగా తీరికే ఉండడం లేదు. చుట్టుపక్కల తల్లిదండ్రులు తమ పిల్లల్ని చెయ్యిపట్టుకుని తీసుకువచ్చి దీపను వారికి స్ఫూర్తిగా చూపిస్తున్నారు. ‘రెండు ముక్కలు మాట్లాడమ్మా’ అని కూడా అడుగుతున్నారు! అగర్తలలో ఇప్పుడు ఆమె బాలీవుడ్ స్టార్‌కి సమానంగా సెలబ్రిటీ అయిపోయారు. ఆటోగ్రాఫ్‌లు అడిగేవారు, ఆమెతో కలిసి సెల్ఫీలు తీసుకోవాలని ఉబలాటపడేవారు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారు. చిన్న పిల్ల... పెద్ద అడుగు! చిన్న పిల్లలు భయపడతారు. జిమ్నాస్టిక్స్ సాధన చేస్తున్నప్పుడు మొదట్లో దీప చాలా భయపడేది. పడిపోతానేమో, దెబ్బలు తగులుతాయేమోనని ఆమె భయం. తల్లి ఒకరోజు దగ్గర కూర్చోబెట్టుకుని చెప్పింది. జీవితాన్ని సవాలుగా తీసుకున్నవారు భయపడకూడదని. భయపడితే ఏదీ సాధించలేమనీ, అనుకున్నది అసలే సాధించలేమనీ. ఆ మాటల్ని విశ్వసించింది దీప. ఒలింపిక్స్‌ని టార్గెట్‌గా పెట్టుకుంది. బరి వరకు వచ్చేసింది. ఒక్క పెద్ద అడుగుతో. ఒకటే కల.. ఒకటే దీక్ష దీప దీక్ష పట్టింది. ఎలాగైనా ఒలింపిక్స్‌లోకి వెళ్లాలని పంతం పట్టింది. ఇంటి బయట పిల్లల్లో ఆడుకోవడం ఇష్టం తనకు. ఆ ఆటల్ని త్యాగం చేసింది. అమ్మతో కబుర్లు చెబుతూ తీరిగ్గా భోజనం చేయడం ఇష్టం తనకు. ఆ ‘తీరిక భోజనాన్నీ’ త్యాగం చేసింది. సినిమాలు, షికార్లు, స్నేహితులు, చిన్న చిన్న షాపింగులు అన్నీ బంద్. ఒక్కోసారి దీప పడుతున్న కష్టం చూడలేకపోయేవారు తల్లిదండ్రులు. కానీ వాళ్లూ దీక్ష పట్టారు. దేశం గౌరవించేంత ఎత్తులో, దేశానికి గౌరవం తెచ్చేంత ఎత్తులో కూతుర్ని తలెత్తి చూడాలని. అందుకే ఆమెతోపాటు వాళ్లూ కొన్ని త్యాగాలు చేశారు. నిద్ర మానుకున్నారు. దీప ప్రాక్టీస్‌కు అవసరమైన డబ్బు సమకూర్చుకోవడం కోసం కష్టపడ్డారు. దీప తండ్రి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అగర్తల కేంద్రంలో వెయిట్ లిఫ్టింగ్ కోచ్. అయితే ఆ పరిచయాలను కూతురు కోసం ఉపయోగించుకోలేదు ఆయన. తొలిసారి దీప పోటీలకు వెళ్లినప్పుడు షూజ్ లేవు. వట్టి కాళ్లతోనే వెళ్లింది. వేసుకున్న ఆ డ్రెస్ కూడా అద్దెకు తెచ్చుకున్నదే! అయితే ఆమె లక్ష్యం ముందు అవి ఏమంత ప్రాముఖ్యంలేని విషయాలు. దీప తన 14 ఏళ్ల వయసులో తొలి విజయాన్ని చవి చూసింది. జూనియర్ నేషనల్స్‌లో విజయం సాధించి కోచ్‌కి, తల్లిదండ్రులకు నమ్మకం కలిగించింది. ఇప్పుడు అదే నమ్మకం దేశ ప్రజలకు కలిగింది. ఎలుకలు, బొద్దింకలతో కలిసి ప్రాక్టీస్! కోచింగ్ తీసుకుంటున్న మొదట్లో దీప వెళ్లే జిమ్‌లో సరైన పరికరాలు ఉండేవి కావు. కనీసం వాల్టింగ్ టేబుల్ కూడా ఉండేది కాదు. జిమ్‌కు వచ్చే అమ్మాయిలు, దీప.. ఒకరి వీపులపై ఒకరు మ్యాట్లు వేసుకుని వారి మీది నుంచి దూకేవారు. అదే వారి వాల్టింగ్ టేబుల్! వర్షాకాలం జిమ్ కొట్టుకుపోయేది. ఏకాలమైనా సరే జిమ్‌లో ఎలుకలు, బొద్దింకలు కాళ్లకు, చేతులకు తగులుతూ ప్రాక్టీస్‌కు అడ్డుపడుతుండేవి. అలా దీప ప్రారంభ సాధనలన్నీ పోరాట విన్యాసాలుగానే మిగిలిపోయాయి. అలా కామన్వెల్త్ గేమ్స్ వరకు వెళ్లగలిగారు. 2014లో కామన్వెల్త్ ఫైనల్స్ జరుగుతున్నాయి. చీలమండ దగ్గర ఆమె కాలు బాగా వాచిపోయింది. వాల్ట్ జంపింగ్ చెయ్యడం మంచిది కాదని కోచ్ సహా చాలామంది చెప్పారు. దీప వినలేదు. రిస్క్ తీసుకోకపోతే లైఫే లేదనుకుంది. అలాగే వెళ్లి పొల్గొంది. నెగ్గింది. అదే ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ ఈవెంట్లో కాంస్యం గెలవగానే దీప పేరు మారుమోగి పోయింది. ‘తీసుకున్నది తిరిగి ఇస్తాను..’ ‘తీసుకున్నదానికి రెట్టింపుగా త్రిపుర కు నేను తిరిగి ఇచ్చేస్తాను’ అని బి.బి.సి.న్యూస్ ఇంటర్వ్యూలో కాస్త ఉద్వేగంగా చెప్పారు దీప. అలా అంటున్నప్పుడు ఆమె స్వరంలో కృతజ్ఞత ధ్వనించింది. ఇంతకీ దీపకు త్రిపుర ఏం ఇచ్చింది? ప్రేమ! సపోర్ట్! ఆ రుణం తీర్చుకోవాలంటే దీపకు ప్రస్తుతం కనిపిస్తున్న ఒకే ఒక మార్గం ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించుకురావడం. ఒలింపిక్స్‌లో దీప గోల్డ్ కొట్టాలంటే... రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందడం ద్వారా దీపా కర్మాకర్ తన తొలి లక్ష్యాన్ని సాధించింది. ఆమె రెండో లక్ష్యం పతకం సాధించడమే. అయితే తన స్వప్నాన్ని సాకారం చేసుకోవాలంటే దీప రెట్టింపుస్థాయిలో శ్రమించాల్సి ఉంటుంది. విశ్వ క్రీడాసంరంభమైన ఒలింపిక్స్ క్రీడల్లో అత్యున్నతస్థాయి క్రీడాకారిణులు పాల్గొంటారు. బరిలో దిగిన ప్రతి ఒక్కరూ పతకం సాధించాలనే లక్ష్యంతోనే వస్తారు. జిమ్నాస్టిక్స్‌లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న అమెరికా, చైనా, జపాన్, రుమేనియా దేశాల అగ్రశ్రేణి జిమ్నాస్ట్‌లతో పోటీపడుతూ దీపా పతకం రేసులో నిలవాలంటే అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 7న మళ్లీ క్వాలిఫై కావాలి పతకం రేసులో నిలవాలంటే దీపా కర్మాకర్ ముందుగా క్వాలిఫయింగ్ పోటీల్లో రాణించాలి. ఒలింపిక్స్ క్రీడల్లో భాగంగా ఆగస్టు 7వ తేదీన దీప క్వాలిఫయింగ్ పోటీలు ఉన్నాయి. ఆ రోజు దీప నాలుగు ఆపరేటస్ (ఫ్లోర్ ఎక్సర్సైజ్, వాల్ట్, అన్ఈవెన్ బార్స్, బ్యాలెన్స్ బీమ్) అంశాల్లో తన విన్యాసాలు ప్రదర్శించాలి. ఈ నాలుగు అంశాల్లో కలిపి అత్యధిక పాయింట్లు సాధించిన టాప్-24 క్రీడాకారిణులు ఆల్‌రౌండ్ వ్యక్తిగత ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. ఫైనల్స్‌లో టాప్-3లో నిలిచిన వారికి పతకాలు లభిస్తాయి. ఆగస్టు 14న ఫైనల్స్ ఆల్‌రౌండ్ విభాగం కాకుండా ఈ నాలుగు ఆపరేటస్ (ఫ్లోర్ ఎక్సర్సైజ్, వాల్ట్, అన్ఈవెన్ బార్స్, బ్యాలెన్స్ బీమ్) అంశాల్లో వేర్వేరుగా నిర్వహించే క్వాలిఫయింగ్ పోటీల్లో టాప్-8లో నిలిచేవారు వ్యక్తిగత ఫైనల్స్‌కు అర్హత పొందుతారు. ఫైనల్స్‌లో టాప్-3లో నిలిచే వారికి పతకాలు దక్కుతాయి. వ్యక్తిగత ఆల్‌రౌండ్ ఫైనల్స్‌ను ఆగస్టు 11న... ‘వాల్ట్’ ఈవెంట్ ఫైనల్స్‌ను ఆగస్టు 14న నిర్వహిస్తారు. దీపా కర్మాకర్ ప్రధాన ఈవెంట్ ‘వాల్ట్’. ఆమె ఈ అంశంలోనే సిద్ధహస్తురాలు. క్వాలిఫయింగ్‌లో అందరికీ రెండుసార్లు చొప్పున అవకాశం లభిస్తుంది. అనంతరం ఆయా జిమ్నాస్ట్‌లు కనబరిచిన విన్యాసాల ఆధారంగా వారికి పాయింట్లు ఇస్తారు. వారు సాధించిన ఓవరాల్ స్కోరును లెక్కిస్తారు. కనీసం 15 పాయింట్లు స్కోరు చేస్తే ఫైనల్‌కు అర్హత సాధించినట్టే. ఫైనల్స్‌కు చేరిన ఎనిమిది మందికి మరోసారి రెండుసార్లు చొప్పున తమ విన్యాసాలను ప్రదర్శించే అవకాశం ఇస్తారు. ఇక్కడా 15 పాయింట్లు సాధిస్తేనే పతకావకాశాలు ఉంటాయి. రియో డి జనీరోలో జరిగిన ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో దీపా కర్మాకర్ ‘వాల్ట్’ ఈవెంట్లో రెండుసార్లు 15 కంటే ఎక్కువ పాయింట్లు స్కోరు సాధించింది. ఇదేరకమైన ప్రదర్శన ఒలింపిక్స్‌లోనూ ఆమె పునరావృతం చేస్తే... కాస్త అదృష్టం కూడా తోడైతే ఆమె మెడలో పతకం చూడొచ్చు. ఘనత ⇒ జిమ్నాస్టిక్స్‌లో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ మహిళ ⇒ 52 ఏళ్ల తర్వాత.. దీప వల్లనే ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్ బరిలోకి భారత్ ⇒ 120 ఏళ్ల ఒలింపిక్స్ చరిత్రలోనే తొలి భారత మహిళా జిమ్నాస్ట్ దీప! దీప సాధించుకు వచ్చింది 1964 నుంచి నేటి వరకు ఒక్క భారతీయ పురుష జిమ్నాస్ట్ కూడా ఒలింపిక్స్ బరి వరకూ రాలేదు. ఆ లోటును ఇప్పుడు స్త్రీ పురుష భేదాలకు అతీతంగా దీప భర్తీ చేశారు. భారతీయ జిమ్నాస్ట్‌లలో ఇప్పటి వరకు 11 మంది పురుషులు మాత్రమే ఒలింపిక్స్‌కి వెళ్లగలిగారు. సంక్షిప్తంగా... పేరు : దీపా కర్మాకర్ ప్రఖ్యాతి : జిమ్నాస్ట్, కామన్వెల్త్ మెడలిస్ట్ ఎత్తు : 4 అ. 11 అం. బరువు : 47 కిలోలు కోచ్ : బిశ్వేశ్వర్ నంది ముద్దు పేరు : గుడ్డూ జన్మదినం : 9 ఆగస్టు 1993 జన్మస్థలం : అగర్తల, త్రిపుర తల్లిదండ్రులు : నాన్న దులాల్, అమ్మ గౌరి చదువు : ఫైనలియర్ డిగ్రీ కాలేజ్ : ఉమెన్స్ కాలేజ్, అగర్తల లక్ష్యం : ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం