బైక్ పైనుంచి కిందపడి యువకుడి మృతి
నాగిరెడ్డిపేట: మండలంలోని మాల్తుమ్మెద గ్రామానికి చెందిన బోయిని దాసు(28) గురువారం వేకువజామున ప్రమాదవశాత్తు బైక్ పైనుంచి కిందపడి మృతిచెందాడు. నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 22 ఏళ్ల క్రితం దాసు తల్లిదండ్రులు చనిపోవడంతో అతనిని గ్రామానికి చెందిన బోయిని మాదయ్య దత్తత తీసుకున్నాడు. నాటి నుంచి మాదయ్య వద్దే ఉంటూ దాసు జీవిస్తున్నాడు. దాసు వేకువజామున బైక్‌పై పొలానికి వెళ్లి తిరిగి వస్తుండగా అదుపుతప్పి కిందపడ్డాడు. తల వెనుకభాగంలో బలమైన గాయం కావడంతో మృతిచెందాడు. కేసు నమోదు చేసిననట్లు ఎస్సై తెలిపారు.
అనారోగ్యంతో ప్రభుత్వ టీచర్..
కమ్మర్పల్లి(భీమ్‌గల్): భీమ్‌గల్ మండలం పిప్రి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో డిప్యుటేషన్‌పై పని చేస్తున్న ఉపాధ్యాయురాలు గంజి ప్రియాంక(27) గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. ప్రియాంక కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ఆమె మృతిపై సర్పంచులు అరిగెల జనార్దన్, వన్నెల బాలమణి, ఉపాధ్యాయులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఫిట్స్‌తో ఒకరు..
వర్ని: మండలంలోని సత్యనారాయణపురం శివారులో గురువారం కోటగిరి గ్రామానికి చెందిన గుడిసె లక్ష్మణ్ (58) ఫిట్స్ వచ్చి మృతి చెందినట్లు వర్ని ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. బాన్సువాడ మార్కెట్ నుంచి మేకలు తీసుకువస్తూ మార్గమధ్యలో బహిర్భూమికి వెళ్లిన లక్ష్మణ్‌కు ఫిట్స్ రావడంతో వ్యవసాయ పొలంలో పడి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


