రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో మహిళా నేతలు | - | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో మహిళా నేతలు

Nov 27 2026 1:14 AM | Updated on Nov 27 2026 1:14 AM

రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో మహిళా నేతలు రాష్ట్రస్థాయి గోవిజ్ఞాన పరీక్షల్లో విద్యార్థుల ప్రతిభ

కామారెడ్డి టౌన్‌ : ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రెటరీ గడ్డం ఇందుప్రియ, జిల్లా మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు ఆకుల కల్పన పాల్గొన్నారు. ఈర్యాలీలో సీఎం రేవంత్‌రెడ్డికి భార త రాజ్యాంగం బుక్‌ను అందజేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌లను కలిశారు.

నిజామాబాద్‌ రూరల్‌: గోసేవ విభాగం తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన గోవిజ్ఞాన రాష్ట్రస్థాయి పరీక్షలో నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు పెద్ది లోకేశ్‌, జ్యోతి మైత్రేయి, కొక్కుల ప్రీతిక ఉత్తమ ప్రతిభ కనబర్చారు. అనంతరం విజేతలకు సర్టిఫికెట్లను అందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ చందన, లయన్‌ ఉండవల్లి శివాజీ, గో సేవ ఇందూర్‌ విభాగ్‌ రాజేశ్వర్‌, రాజ్‌కుమార్‌, లక్ష్మీనారాయణ, భాస్కర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement