ఎల్లారెడ్డి: ప్లాస్టిక్ నిర్మూలనకు వ్యాపారులు స్వచ్ఛందంగా సహకరించాలని మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ అన్నారు. గురువారం ఎల్లారెడ్డిలో వ్యాపారసంఘం భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డిలో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ప్లాస్టిక్ విక్రయాలను జరపకుండా ముందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు. ప్లాస్టిక్ నివారణకు అందరు వ్యాపారస్తులు సహకరించడం పట్ల ఆయన వ్యాపార వర్గాల వారిని అభినందించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా, ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు వ్యాపారులు, ప్రజలు ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని కోరారు. వ్యాపార సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.


