పర్యావరణ పరిరక్షణ ‘పీఎం సూర్యఘర్‌’ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణ ‘పీఎం సూర్యఘర్‌’ లక్ష్యం

Nov 27 2026 1:14 AM | Updated on Nov 27 2026 1:14 AM

సుభాష్‌నగర్‌: పర్యావరణ పరిరక్షణ, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం పీఎం సూర్యఘర్‌ పథకాన్ని అమలు చేస్తోందని ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ పీవీ రాజేశ్వర్‌రావు అన్నారు. సోలార్‌ విద్యుత్‌ వినియోగంపై ఇంజినీర్లకు జిల్లా కేంద్రంలోని విద్యుత్‌ భవన్‌లో ఉన్న టీజీఎన్‌పీడీసీఎల్‌ గోల్డెన్‌ జూబ్లీ మీటింగ్‌ హాల్‌లో రెండు రోజులపాటు నిర్వహించిన శిక్షణ గురువారం ముగిసింది. కేంద్ర ప్రభుత్వ నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న పీఎం సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజ్లీ యోజన పథకాన్ని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు సౌర విద్యుత్‌ వినియోగంపై సాంకేతిక అవగాహన పెంపొందించేందుకు ఇంజినీర్లకు రెక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పవర్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. 40 మంది ఇంజినీర్లకు ఎస్‌ఈ పీవీ రాజేశ్వర్‌రావు, టెక్నికల్‌ డీఈ డి వెంకటరమణ, ఫ్యాకల్టీ రాంచందర్‌ చేతుల మీదుగా ధ్రువపత్రాలు అందజేశారు. నిజామాబాద్‌ సర్కిల్‌ నుంచి 20 మంది ఇంజినీర్లు, కామారెడ్డి సర్కిల్‌ నుంచి 20 మంది ఇంజినీర్లు హాజరయ్యారు. కార్యక్రమంలో టెక్నికల్‌ ఏడీఈ జె శ్రీధర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement