కల్యాణి ప్రాజెక్టు రెండు గేట్ల ఎత్తివేత | - | Sakshi
Sakshi News home page

కల్యాణి ప్రాజెక్టు రెండు గేట్ల ఎత్తివేత

Jul 30 2026 1:33 AM | Updated on Jul 30 2026 1:33 AM

కల్యాణి ప్రాజెక్టు రెండు గేట్ల ఎత్తివేత

ఎల్లారెడ్డి: తిమ్మారెడ్డి శివారులోని కల్యాణి ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 409.5 అడుగులు కాగా.. బుధవారం సాయంత్రానికి 408.6 అడుగులకు చేరుకుంది. దీంతో రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు 430 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 180 క్యూసెక్కులను నిజాంసాగర్‌ ప్రధాన కాలువకు మళ్లిస్తున్నామని, 250 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నామని అధికారులు తెలిపారు.

‘పోచారం’లోకి 5,377 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

నాగిరెడ్డిపేట: పోచారం ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మూడురోజులుగా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి వదరనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి 5,377 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని ఇరిగేషన్‌ ఏఈ అక్షయ్‌కుమార్‌ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 1.820 టీఎంసీలు కాగా బుధవారం సాయంత్రానికి ప్రాజెక్టులో 0.470 టీఎంసీల నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు.

నిజాంసాగర్‌లోకి 6,585 క్యూసెక్కులు..

నిజాంసాగర్‌: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా వరప్రదాయిని అయిన నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి బుధవారం 6,585 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. కౌలాస్‌ ప్రాజెక్టులోకి 740 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement