కామారెడ్డి క్రైం: ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జిల్లాలో సర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో సర్ కార్యక్రమం పురోగతిపై సమీక్షించారు. పలు సూచనలు ఇచ్చారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 3 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ జిల్లాలో సర్ ప్రక్రియను వివరించారు. మ్యాపింగ్ చేసిన డేటా ఆధారంగా ఎన్యుమరేషన్ ఫారాలను క్షుణ్ణంగా పరిశీలించి, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, కామారెడ్డి ఆర్డీవో గిరి, ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


