ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి

Jul 29 2026 1:22 AM | Updated on Jul 29 2026 1:22 AM

ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి

జల సంరక్షణ చర్యలు చేపట్టాలి

కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

దోమకొండ: రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ సూచించారు. జల సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. మంగళవారం రైతు నేస్తం 100వ ఎపిసోడ్‌ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. దోమకొండనుంచి కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై పలు సూచనలు ఇచ్చారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ఈసారి వర్షపాతం తక్కువ నమోదయ్యే అవకాశాలు ఉన్నందున రైతులు తక్కువ నీటితో సాగయ్యే పెసర్లు, కందులు, మినుములు, నూనెగింజల పంటలు, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వ్యవసాయ శాఖ ఎంపిక చేసిన జిల్లాలోని ముగ్గురు ఉత్తమ రైతులతోపాటు ఉత్తమ వ్యవసాయ విస్తరణ అధికారులను కూడా సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ గిరి, ఉద్యానవన శాఖ జిల్లా అధికారి జ్యోతి, ఏడీఏ అపర్ణ, కామారెడ్డి ఏవో పవన్‌కుమార్‌, దోమకొండ ఇన్‌చార్జి ఏవో నరేందర్‌, తహసీల్దార్‌ స్వప్న, ఎంపీడీవో మధురిమ, ఎంఈవో విజయ్‌కుమార్‌, ఎంపీవో రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement