నకిలీ గెజిటెడ్‌ సంతకానికి రూ.5 వేలు | - | Sakshi
Sakshi News home page

నకిలీ గెజిటెడ్‌ సంతకానికి రూ.5 వేలు

Jul 29 2026 1:22 AM | Updated on Jul 29 2026 1:22 AM

కామారెడ్డి క్రైం : అడ్డదారిలో డబ్బులు సంపాదించడానికి నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలకు దరఖాస్తులు చేస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మూడు రోజుల క్రితం వెలుగు చూసిన భిక్క నూర్‌ నకిలీ ధ్రువపత్రాల తయారీ కేసును పోలీసు లు ఛేదించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేశ్‌ చంద్ర వివరాలు వెల్లడించారు. తన సంతకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఫో ర్జరీ చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వాడుతు న్నారని నాలుగు రోజుల క్రితం కామారెడ్డి జిల్లా జ నరల్‌ ఆస్పత్రి ఆర్‌ఎంవో సంతోష్‌ పట్టణ పోలీసుల కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసు లు సాంకేతిక ఆధారాలతో విచారణ ప్రారంభించా రు. భిక్కనూరులో జిరాక్స్‌, ఆన్‌లైన్‌ సెంటర్‌ నడిపించే తోడెంగల రాజా నరేందర్‌, రాజలింగంలు జి ల్లా జనరల్‌ ఆస్పత్రిలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా ప నిచేసే బోయిని ప్రసాద్‌లు కలిసి ముఠాగా ఏర్పడి గెజిటెడ్‌ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి ప్రభు త్వ సంక్షేమ పథకాలకు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. జిరాక్స్‌ కేంద్రంలో తనిఖీలు చేపట్టిన కామారెడ్డి పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు తెలిపారు.

నిందితులు ముందుగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలకు దరఖాస్తు చేసుకునే వారి నుంచి వివాహ పత్రికలు, ఆధార్‌ కార్డులు, కుల, ఆదాయ, నివాస, ఇతర ధ్రువీకరణ పత్రాలు సేకరిస్తారు. ప్రతి దరఖాస్తుకు రూ.4,500 నుంచి రూ. 5 వేల వరకు వసూలు చేస్తూ, గెజిటెడ్‌ సంతకాల ఫోర్జరీతో ఆన్‌లైన్‌ చేసేవారని విచారణలో వెల్లడైంది. అవసరమైతే ఇతర పత్రాలను సైతం నకిలీవి త యారు చేసేవారు. ఇందుకోసం జిరాక్స్‌ కేంద్రంలో కంప్యూటర్‌, నకిలీ రబ్బరు స్టాంపులు, స్టాంప్‌ ప్యా డ్‌లు, పేపర్లు, ధ్రువీకరణకు సిద్ధం చేసిన పత్రాల తో పూర్తి ఏర్పాట్లు చేసుకున్నారు. వాటన్నింటినీ పో లీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇప్పటివరకు భిక్కనూర్‌ మండలానికి చెందిన 52 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేసినట్లు విచారణలో తేలింది. వా టిలో 34 మందికి ఇప్పటికే చెక్కులు అందాయి. మ రో 18 ఫైళ్లు ప్రాసెసింగ్‌ దశలో ఉన్నాయి. ఈ 52 మంది లబ్ధిదారుల వివరాలను తదుపరి విచారణ నిమిత్తం సంబంధిత శాఖల జిల్లా అధికారులకు అందజేస్తామని అన్నారు. నకిలీ ధృవపత్రాలతో ఈ పథకాలకు దరఖాస్తులు చేయడం భిక్కనూర్‌ మండలానికే పరిమితమైందా, లేక ఈ వ్యవహారం ఇత ర ప్రాంతాలకు విస్తరించిందా అనే వాటిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కోర్టు అనుమతితో నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారణ కొనసాగి స్తామని ఎస్పీ తెలిపారు. కేసు ఛేదనలో కృషి చేసిన పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి, సిబ్బందిని అఽభినందించారు. సమావేశంలో డీఎస్పీ మధుసూదన్‌, అధికారులు పాల్గొన్నారు.

అడ్డదారిలో కల్యాణలక్ష్మి,

షాదీ ముబారక్‌ దరఖాస్తులు

భిక్కనూర్‌ నకిలీ ధ్రువపత్రాల కేసులో ముగ్గురి అరెస్ట్‌

వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్‌ చంద్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement