మద్నూర్‌ మండల పీఆర్టీయూ కార్యవర్గం ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

మద్నూర్‌ మండల పీఆర్టీయూ కార్యవర్గం ఎన్నిక

Jul 29 2026 1:22 AM | Updated on Jul 29 2026 1:22 AM

మద్నూర్‌ మండల పీఆర్టీయూ కార్యవర్గం ఎన్నిక ఉన్నత పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటు ఫాంపాండ్‌ నిర్మాణానికి భూమిపూజ ఆరుతడి పంటల సాగుకే మొగ్గు చూపాలి స.హ. చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

మద్నూర్‌(జుక్కల్‌): మద్నూర్‌ మండల పీ ఆర్టీయూ నూతన కా ర్యవర్గాన్ని ఎన్నుకున్న ట్లు జిల్లా అధ్యక్షుడు కు శాల్‌ మంగళవారం ఒ క ప్రకటనలో తెలిపారు. మద్నూర్‌ మండల పీ ఆర్టీయూ నూతన అధ్యక్షుడిగా శివరాం, ప్రధా న కార్యదర్శిగా శివశంకర్‌, అసోసియేట్‌ అధ్యక్షులు పండరీనాథ్‌, శివప్రభ, ఉపాధ్యక్షులు శి వాజీ, మారుతి, మహిళ ఉపాధ్యక్షులుగా అని త, పార్వతి, కార్యదర్శిగా రాజు, మహిళ కార్యదర్శిగా సరస్వతి, మహిళ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు పట్టాభి, పీఆర్టీయూ నాయ కులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కామారెడ్డి అర్బన్‌ : విద్యార్థుల్లో పుస్తక పఠనశక్తిని పెంచడానికి జిల్లాలోని 11 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎం.చంద్రకాంత్‌రెడ్డి అన్నారు. పాఠశాల గ్రంథాలయాల ఏర్పాటుకు ఒక్కో పాఠశాలకు రూ.15వేలతో పాటు ప్రతినెల నిర్వహణకు రూ. 1000 చెల్లిస్తారన్నారు.

నిజాంసాగర్‌(జుక్కల్‌): జుక్కల్‌ మండలం ఖండెబల్లూర్‌ గ్రామంలో ఫాంపాండ్‌ నిర్మాణానికి మంగళవారం జెడ్పీ సీఈవో చందర్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌ భూమిపూజ చేశారు. వర్షపు నీటి నిల్వకోసం ఇంకుడు గుంతలతో పాటు ఫాంపాండ్స్‌ నిర్మాణం చేపట్టాలన్నారు. ఎంపీవో రాము, ఈజీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): మండలంలోని ధర్మారావ్‌పేట్‌ రైతువేదికలో మంగళవారం రైతు నేస్తం 100వ ఎపిసోడ్‌ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమాన్ని ఉద్దేశించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు మాట్లాడారు. ఈ ఖరీఫ్‌లో ఆరుతడి పంటల సాగుకే రైతులు మొగ్గు చూపాలన్నారు. ధర్మారావ్‌పేట్‌, అమర్లబండ సర్పంచ్‌లు ఉమర్‌, బాల్‌రాజ్‌, మండల వ్యవసాయాధికారి ప్రజాపతి, ఏఈవోలు లిఖిత్‌ రెడ్డి, కవిత, కల్యాణి, సురేందర్‌, సులోచన , రైతులు తదితరులు పాల్గొన్నారు.

రామారెడ్డి (ఎల్లారెడ్డి): సమాచార హక్కు చట్టాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాల ని స.హ. చట్టం మండల అధ్యక్షుడు మోషన్‌పల్లి ప్రశాంత్‌ అన్నారు. మంగళవారం మండలకేంద్రంలో తహసీల్దార్‌ ఉమాలత, ఎస్‌ఐ ముర ళిలను స.హ. చట్టం సభ్యులు కలిశారు. అనంతరం అధికారులను సన్మానించారు.ఉపాధ్యక్షులు పందిరి శ్రీకాంత్‌, జనరల్‌ కార్యదర్శి దండబోయి బాల్‌రాజు, జాయింట్‌ కార్యదర్శి నో ముల పరశురామ్‌, సభ్యులు పాల్గొన్నారు.

బాన్సువాడ : ప్రయివేటు పాఠశాలలో పుస్తకాలు, యూనిఫాంలు అమ్ముతున్నారని వెంటనే వాటిపై చర్యలు తీసుకోవాలని లంబాడి స్టూడెంట్‌ అర్గనేషన్‌ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు ప్రకాష్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన బాన్సువాడలో మీడియాలో మాట్లాడారు. ఈ సమావేశంలో విద్యార్థి సంఘం నాయకులు జైపాల్‌రెడ్డి, అజయ్‌, రమేష్‌, మోహాన్‌, రవి, అర్జున్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement