దుర్కిలో కారు బోల్తా.. ఇద్దరికి తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

దుర్కిలో కారు బోల్తా.. ఇద్దరికి తీవ్ర గాయాలు

Jul 29 2026 1:22 AM | Updated on Jul 29 2026 1:22 AM

దుర్కిలో కారు బోల్తా.. ఇద్దరికి తీవ్ర గాయాలు మేక పిల్లను పీక్కుతిన్న వీధి కుక్కలు డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో 71 మందికి శిక్షలు మట్కా ఆడుతున్న ఒకరి అరెస్టు

నస్రుల్లాబాద్‌: మండలంలోని దుర్కి శివారులో ఓ కారు అదుపుతప్పి మంగళవారం బోల్తా కొట్టింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్‌కు చెందిన రవీందర్‌రెడ్డి అతని భార్య, తండ్రి బాన్సువాడ మీదుగా హైదరాబాద్‌కు కారులో వెళ్తున్నారు. దుర్కి శివారులో కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొని బోల్తా పడింది. ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా స్థానికులు బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై ఎస్సై రాఘవేంద్రను వివరణ కోరగా తమ దృష్టికి రాలేదని పేర్కొన్నారు.

పిట్లం: మండల కేంద్రంలోని శాంతినగర్‌ కాలనీలో మంగళవారం ఓ మేక పిల్లపై వీధి కుక్కలు దాడి చే సి పిక్కుతిన్నాయి. ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. చిన్నారులు ఎవరైనా ఉంటే పెద్ద ప్రమాదం జరిగేదని స్థానికులు పేర్కొన్నారు. అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

కామారెడ్డి క్రైౖం: మద్యం సేవించి వాహనాలు నడిపినందుకు గాను జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ కోర్టులు మంగళవారం ఒకే రోజు 71 మందికి శిక్షలు విధించాయి. వాహనాల తనిఖీల్లో పట్టుబడిన వారిని ఆయా కోర్టుల్లో హాజరుపర్చగా పది మందికి ఒకరోజు, ముగ్గురికి రెండు రోజుల జైలు శిక్షతో పాటు మొత్తం 71 మందికి రూ.81,500 జరిమానా విధించినట్లు ఎస్పీ రాజేశ్‌ చంద్ర మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం నేరమన్నారు. జిల్లాలోని అన్ని పీఎస్‌ల పరిధిలో క్రమం తప్పకుండా వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవన్నారు.

నిజామాబాద్‌ అర్బన్‌: ఆన్‌లైన్‌లో మట్కా ఆడుతున్న ఒకరిని అరెస్టు చేసినట్లు ఐదో టౌన్‌ ఎస్సై సునీల్‌ మంగళవారం తెలిపారు. ఇంద్రపూర్‌ కాలనీకి చెందిన రమేశ్‌ ఫోన్‌లో మట్కా ఆడుతుండగా పట్టుకున్నామని అన్నారు. రమేశ్‌కు శాంతినగర్‌కు చెందిన షేక్‌అస్రాప్‌ మట్కా ఆడిస్తున్నట్లు నిర్ధారణ అయిందన్నారు. రమేశ్‌ నుంచి రూ.5,070 నగదు, మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement