● భారతీయ కిసాన్ సంఘ్ అఖిల
భారత కార్యకారిణి సభ్యులు
ముదుగంటి శ్రీధర్‌రెడ్డి
కామారెడ్డి అర్బన్: వ్యవసాయంలో మహిళల పాత్ర కీలకమని భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారత కార్యకారిణి సభ్యులు ముదుగంటి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం లింగాపూర్ బృందావన్ ఫంక్షన్ హాల్‌లో బీకేఎస్ ఆధ్వర్యంలో కుటుంబాల సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగం, ఉత్పత్తి రంగాలలో మహిళ పాత్ర 70 శాతానికిపైగా ఉందన్నారు. అన్ని రంగాల్లో మహిళల ప్రాధాన్యతను గుర్తించాలన్నారు. రసాయనిక ఎరువులను వినియోగించకుండా ఆధునిక వ్యవసాయాన్ని లాభాసాటిగా మార్పు చేసే ప్రయత్నంలో మహిళలను భాగస్వాములను చేయాలనే ఆలోచనతో కుటుంబాల సమ్మేళనాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రకృతి వ్యవసాయం చేసి సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మహిళలపై ఉందని వక్తలు పేర్కొన్నారు. వ్యవసాయంలో అనేక సమస్యలున్నాయని వాటిని అధిగమించాలని పిలుపునిచ్చారు. సమ్మేళనంలో బీకేఎస్ దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి దోనూరి రాము, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అంజిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు విఠల్‌రెడ్డి, ప్రతినిధులు మోహన్‌రెడ్డి, లావణ్య, నగేశ్, ఆనందరావు, మాణిక్యరెడ్డి, పెద్ద అంజన్న, ఎల్.ప్రముఖ, శంకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.


