సైన్స్‌ ప్రాజెక్టులు నిర్వహించాలి : కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

సైన్స్‌ ప్రాజెక్టులు నిర్వహించాలి : కలెక్టర్‌

Jul 29 2026 1:22 AM | Updated on Jul 29 2026 1:22 AM

దోమకొండ : విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు పక్షులు, పర్యావరణ స్పృహ అంశంపై సైన్స్‌ ప్రాజెక్టులు నిర్వహించాలని కలెక్టర్‌ కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ సూచించారు. మంగళవారం దోమకొండ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్‌.. విద్యార్థులతో మాట్లాడారు. పక్షులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం, మొక్కలు నాటడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి అలవాట్లు అలవరుచుకోవాలని సూచించారు. సంఖ్యాశాస్త్రాన్ని నిత్య జీవితంలో అన్వయించుకోవాలన్నారు. అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ను సమర్థవంతంగా వినియోగించుకొని శాసీ్త్రయ దృక్పథం, సృజనాత్మకతను పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాలలోని వంటగది, మరుగుదొడ్లు, ప్రయోగశాలలను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ గిరి, డీఈవో మల్లికార్జున్‌, విద్యాశాఖ సమన్వయకర్త వేణుగోపాల్‌, ఎంఈవో విజయకుమార్‌, ప్రధానోపాధ్యాయులు శరత్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement