● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
● ప్రజావాణికి 88 దరఖాస్తులు
కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 88 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అఽధికారులు వెంటనే పరిశీలించాలన్నారు. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, గిరి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, జెడ్పీ సీఈవో చందర్, కలెక్టరేట్ పాలనాధికారి మసూర్ అహ్మద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పట్టాలు ఇప్పించండి..
లింగంపేట: మండల కేంద్రం శివారులోని 983 సర్వే నంబర్‌లో గల అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వాలని పలువురు రైతులు కోరారు. సోమవారం కలెక్టరేట్‌కు వెళ్లి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తాము ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను ఆర్‌వోఎఫ్‌ఆర్ భూములుగా చూపిస్తుండడంతో ఇబ్బందిపడుతున్నామన్నారు. ఆ భూములకు పట్టాలిచ్చి ఆదుకోవాలని కోరారు. రైతులు సాయిలు, పోచయ్య, సత్తవ్వ, తదితరులున్నారు.


