● జుక్కల్ నియోజకవర్గ
అభివృద్ధే ధ్యేయం
● ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
మద్నూర్(జుక్కల్):అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందిస్తామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. మండల కేంద్రంలోని పబ్లిక్ టాయిలెట్ల భవనాన్ని ఆదివారం ప్రారంభించారు. అనంతరం రైతు వేదికలో 61 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. అన్ని మండలాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నా రు. మద్నూర్‌లో రూ. 2 కోట్లతో నూతన తహసీల్ కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఇందిరనగర్ కాలనీలో మురికికాలువలు, రోడ్డు, కమ్యునిటీ భవనానికి త్వరలో శంకుస్థాపన చేసి పనులను ప్రారంభిస్తామన్నారు. తహసీల్దార్ ముజీబ్, సర్పంచ్ ఉషసంతోష్, సలాబత్‌పూర్ హ నుమాన్ ఆలయ చైర్మన్ రాంపటేల్, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి సహకరించాలి
నిజాంసాగర్(జుక్కల్): క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికారులు తమవంతు కృషి చేయాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. ఆదివారం మండలంలోని నర్సింగ్‌రావ్‌వుపల్లి చౌరస్తా వద్ద హోటల్‌లో చాయ్ తాగుతూ చర్చిస్తుండగా స్థానికులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వాటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులకు ఫోన్ ద్వారా సూచించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు
జుక్కల్ మండలంలోని కౌలాస్ ఎల్లమ్మ ఆలయాన్ని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కౌలాస్ కోట నిర్వాహకులు, నాయకులు ఉన్నారు.


