క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Jul 27 2026 1:48 AM | Updated on Jul 27 2026 1:48 AM

బైకు నుంచి డబ్బులు మాయం.. గొర్రెల మందపై వీధి కుక్కల దాడి

మద్యానికి బానిసై ఒకరి ఆత్మహత్య

రుద్రూర్‌: మండలంలోని బొప్పాపూర్‌ గ్రామానికి చెందిన గొండల శ్రీని వాస్‌ (46) అ నే వ్యక్తి మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై మనోజ్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం..కొన్నేళ్లుగా మద్యానికి బానిసైన శ్రీనివాస్‌ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం తన స్వంత పొలంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డా డు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

వేల్పూర్‌(బాల్కొండ): బాల్కొండ మండలం జలాల్‌పూర్‌ గ్రామానికి చెందిన చిందేకర్‌ గంగాధర్‌ బైకు నుంచి రూ.20 వేలు మాయంపై ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై శైలేందర్‌ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. గంగాధర్‌ అనే వ్యక్తి ఈనెల 20న యూనియన్‌ బ్యాంకు నుంచి రూ. 20 వేలు డ్రా చేసుకొని బైకు కవర్‌లో పెట్టుకొని ఇంటికి వెళ్తూ స్థానిక మెడికల్‌ షాపు వద్ద మందులు కొనేందుకు వెళ్లాడు. మందులు తీసుకొని వచ్చేసరికి బైకులో ఉన్న డబ్బులు మాయమయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

నిజాంసాగర్‌: గొర్రెల మందపై వీధికుక్కలు మూకుమ్మడిగా దాడి చేయ డంతో మూడు గొర్రెలు మృత్యువాత పడగా మరో 5 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. జుక్కల్‌ మండలం బస్వాపూర్‌ గ్రామానికి చెందిన వాగ్మరే హన్మంతు తన గొర్రెలను కొట్టంలో ఉంచగా 20కి పైగా వీధికుక్కలు ఆదివారం వేకువజామున మూకుమ్మడిగా దాడి చేశాయి. గొర్రెల అరుపులు విన్న రైతు హన్మంతు తోటి రైతులతో కుక్కలను తరిమివేశారు. దాడిలో మూడు గొర్రెలు మృతి చెందగా 5 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. గాయపడిన గొర్రెలకు పశువైద్య సిబ్బంది చికిత్సలు చేశారు. కుక్కల దాడితో బాధిత రైతుకు రూ. 40 వేల వరకు నష్టం వాటిల్లినట్లు గ్రామస్తులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement