కరీంనగర్ స్పోర్ట్స్: కరీంనగర్ జిల్లా కేంద్రంలో మూడు రోజుల పాటు నిర్వహించిన సీబీఎస్‌ఈ క్లస్టర్–7 ఖోఖో బాలికల టోర్నీ ఆదివారం ఘనంగా ముగిసింది. కరీంనగర్ కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ–టెక్నో స్కూల్ ఆతిథ్యంలో నిర్వహించిన ఈ క్రీడా సమరంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అండర్ 14, 17, 19 విభాగంలో 104 జట్లు పోటీపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఫైనల్లో అండర్–19 విభాగంలో శ్రీ ప్రకాశ్ విద్యానికేతన్, అండర్–17లో మాంటిస్సోరి ఎలైట్ స్కూల్, అండర్– 14లో ఏకశిల హైస్కూల్ జట్లు విజేతలుగా నిలిచా యి. విజేత జట్లకు అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి ట్రోపీలు, మెడల్స్ ప్రదానం చేశారు. సీబీఎస్‌ఈ పరిశీలకుడు భరత్ కుమార్, తెలంగాణ ఖోఖో సంఘం రెఫరీ బోర్డు కన్వీనర్ వంగపల్లి సూర్య ప్రకాశ్, భారత మహిళా ఖోఖో జట్టు కోచ్ నరేశ్, అంతర్జాతీయ రెఫరీ రవీందర్, షఫీ, ఎస్కె మొయినొద్దీన్, వేల్పుల సురేందర్ పాల్గొన్నారు.


