కామారెడ్డి టౌన్: మున్సిపల్ పరిధిలోని 15వ వార్డులోని రోడ్డు అధ్వానంగా మారింది. కురుస్తున్న వర్షాలకు రోడ్డంతా బురదమయంగా మా రడంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గంలోనే ప్రభుత్వ వృద్ధాశ్రమంతో పాటు పాత జాతీయ రహదారి నుంచి అశోక్‌నగర్ కాలనీకి వెళ్లే ప్రధాన రహదా రి ఉంది. ఆదివారం వృద్ధాశ్రమానికి తాగునీరు తీసుకెళ్తున్న ఆటో బురదలో ఇరుక్కుపోవడంతో నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులు స్పందించి రోడ్డు సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.


