వద్దన్నా.. వరి నాట్లు
వరి నారు తీస్తున్న రైతులు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా రైతాంగం వరి సాగు విషయంలో వెనక్కి తగ్గడం లేదు. వరి వద్దని ప్రభు త్వం స్పష్టం చేస్తున్నా రైతులు మాత్రం నాట్లు వేస్తూ నే ఉన్నారు. ఈ నెల 24 నాటికి జిల్లాలో లక్షా 70 వేల ఎకరాల్లో వరి నాట్లు పడినట్టు వ్యవసాయ శాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మరో లక్షా 20 వేల ఎకరాలకు సరిపడా నారుమడులు సిద్ధంగా ఉన్న ట్టు పేర్కొంటున్నారు. మరో వారం, పది రోజుల్లో ఇంకో లక్ష ఎకరాల్లో నాట్లు వేసే అవకాశం ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఒక వైపు వర్షాభావం, మరోవైపు భూగర్భజలమట్టం పడిపోతుండడం, చెరువులు, కుంటలు వెలవెలబోతున్న పరిస్థితుల్లో ఎక్కువ నీటి వాడకం ఉండే వరి సాగు వద్దని ప్రభుత్వం చెబుతోంది. అయితే, నారుమడులు పోసిన రైతు లు ఎట్లయితే అట్లా అన్నట్టు నాట్లేసేస్తున్నారు. దీంతో జిల్లాలో వరి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. జిల్లా లో అత్యధికంగా భిక్కనూరు మండలంలో 16,523 ఎకరాల్లో వరి నాట్లు వేశారు. బాన్సువాడలో 14,955 ఎకరాల్లో నాట్లు పడ్డాయి. తర్వాతి స్థానంలో బీర్కూర్ ఉండగా, భూగర్భజలాలపైనే ఆధారపడిన లింగంపేట, పిట్లం, నాగిరెడ్డిపేట, గాంధారి, కామారెడ్డి, ఎల్లారెడ్డి, సదాశివనగర్, రాజంపేట, బీబీపేట, దోమకొండ, మాచారెడ్డి, పాల్వంచ తదితర మండలాల్లో నాట్లు వేస్తూనే ఉన్నారు.
వెనక్కి తగ్గని రైతాంగం
జిల్లాలో ఇప్పటికే 1.70 లక్షల
ఎకరాలకుపైగా సాగు
ప్రత్యామ్నాయ పంటలు
పండించాలంటున్న ప్రభుత్వం


