● ప్రారంభించిన ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ : బీర్కూర్ మండలం తిమ్మాపూర్ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద లైనింగ్ వాల్ పను లను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. ఆలయానికి కాలినడకన వచ్చే భక్తుల కోసం రూ.20 లక్షల తో మెట్ల మార్గం, రూ.50 లక్షలతో లైనింగ్‌వాల్ ని ర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా పోచా రం మాట్లాడుతూ తెలంగాణ తిరుమలకు భక్తుల తాకిడి పెరుగుతుండటంతో మెట్లు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం బాన్సువాడలోని ఇస్లాంపూర కాలనీని ఆయన సందర్శించారు.


