సదాశివనగర్(ఎల్లారెడ్డి): మొక్కల సంరక్షణ అందరి బాధ్యత అని మండలంలోని వజ్జపల్లి తండా సర్పంచ్ సంధ్య సూచించారు. శనివారం వనమహోత్సవంలో భాగంగా తండాలో ఇంటింటికి మొక్కలను పంపిణీ చేశారు.ఉప సర్పంచ్ రవీందర్, పంచాయతీ కార్యదర్శి శ్రీజ, వార్డు సభ్యులు అశోక్, లక్ష్మణ్, లక్ష్మి, లలిత, పన్ని, నాజీ తదితరులు పాల్గొన్నారు.
తాడ్వాయి: వనమహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో భరత్‌కుమార్ అన్నా రు. తాడ్వాయి మండల పరిషత్ కార్యాలయంలో శనివారం అధికారులతో సమీక్ష సమావేశంలో ఆ యన మాట్లాడారు. ప్రతి గ్రామంలో బోర్‌వెల్ పనులను రీచార్జి చేయాలన్నారు. అలాగే సీజనల్ వ్యాఽ దులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో సవితారెడ్డి, ఏపీవో తిరుపతి, ఏవో నర్సింలు, ఏఈవోలు, జీపి కార్యదర్శులు పాల్గొన్నారు.


