బీర్కూర్ వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేస్తున్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి
తాడ్వాయిలోని వేంకటేశ్వరాలయంలో ...
సాక్షి నెట్‌వర్క్: తొలి ఏకాదశి సందర్భంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మహావిష్ణు ఆలయాలు శనివారం భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరు కొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయాల్లో వేదమంత్రోచ్చరణలు, విష్ణు సహస్రనామ పారాయణం, భజనలు, హారతులతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకొంది. దర్శనం కోసం భక్తులు బారులు తీరగా ఆల య నిర్వాహకులు తాగునీరు, ప్రసాదం, క్యూలైన్ల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
జిల్లాలోని వైష్ణవ ఆలయాలకు
పోటెత్తిన భక్తులు
తెల్లవారుజాము నుంచే
ప్రత్యేక పూజలు, అభిషేకాలు
గోవింద నామస్మరణతో
మారుమోగిన ఆలయ ప్రాంగణాలు


