శ్రీఅర్ధ చాతుర్మాస్య మహా వ్రతం ప్రారంభం
కామారెడ్డి అర్బన్: ఆధ్యాత్మిక సాధనకు చాతుర్మాస్యం ఎంతో అనుకూలమైందని కామారెడ్డి శ్రీకృష్ణ గీతా మందిరం కార్యదర్శి అర్వపల్లి రమేశ్ అన్నారు. ఏకాదశి సందర్భంగా శనివారం తొలిరోజు కాషాయ పతాకాన్ని ఆవిష్కరించి 44వ శ్రీఅర్ధ చాతుర్మాస్య మహా వ్రతం ప్రారంభించారు. ప్రతినిధులు పాత అశోక్, వెంకటేశం, రమేష్, లక్ష్మిపతి, కృష్ణమూర్తి, మహిళా ప్రతినిధులున్నారు.
అక్కంపల్లిలో లక్ష పుష్పార్చన
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి) : తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నాగిరెడ్డిపేట మండలం అక్కంపల్లిలో గల వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో వేద పండితులు అభిలాష్ శర్మ గణపతి పూజ యజ్ఞం నిర్వహించారు.
వర్షాల కోసం ఈద్గాల వద్ద ప్రార్థనలు
భిక్కనూరు: మండల కేంద్రంలోని ఈద్గా వద్ద ముస్లింలు వర్షాల కోసం శనివారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మధ్యాహ్నం మసీద్‌లో ప్రార్థనలు చేసిన అనంతరం వారందరూ ఈద్గ వద్దకు వెళ్ళి అక్కడ అరగంట పాటు వర్షాల కోసం ప్రార్థనలు చేశారు. ముస్లింలు పాల్గొన్నారు.
వందవారాల హనుమాన్ చాలీసా
భిక్కనూరు: మండలంలోని జంగంపల్లిలోని దాసాంజనేయస్వామి ఆలయంలో వంద వా రాల హన్‌మాన్‌చాలీసా పఠనం కార్యక్రమం శనివారం జరిగింది. తొలి ఏకాదశితో పాటు వంద వారాల నిరంతర హన్‌మాన్ చాలీసా కార్యక్రమం కావడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసింది. భక్తులు 108 పర్యాయాలు హన్‌మాన్‌చాలీసా పఠించారు.


